పోచమ్మ తల్లికి నీరాజనం

ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST

అడెల్లి పోచమ్మ తల్లి చల్లంగా చూడమ్మ అంటూ భక్తులు అమ్మవారికి నీరాజనం పలికారు. మండలంలోని అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది.

పోచమ్మ తల్లికి నీరాజనం
దిలావర్‌పూర్‌లో గంగనీళ్ల జాతర దృశ్యం


ముగిసిన గంగనీళ్ల జాతర

మొక్కులు తీర్చుకున్న భక్తులు

సారంగాపూర్‌/ దిలావర్‌పూర్‌, అక్టోబరు 2: అడెల్లి పోచమ్మ తల్లి చల్లంగా చూడమ్మ అంటూ భక్తులు అమ్మవారికి నీరాజనం పలికారు. మండలంలోని అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. రెండు రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన అడెల్లి పోచమ్మ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం మధ్యాహ్నం పోచమ్మ నగలను అడెల్లి దేవాలయం నుంచి వేలాది మంది భక్తులు కాలినడకతో 30 కిలో మీటర్ల పాటు దిలావర్‌పూర్‌ మండలం సాంగ్వి గోదావరి నదికి తీసుకెళ్లారు. నది జలాలతో అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేసిన అనంతరం ఆభరణాల మూటతో వేలాది మంది భక్తులు వెంటరాగా భారీ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవారు తన సన్నిధి అడెల్లికి బయలుదేరింది. అమ్మవారి నగల మూటపై పసుపు చల్లి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకు న్నారు. ఆభరణాల మూటను తాకేందుకు భక్తులు పో టీ పడ్డారు. అమ్మవారి పూనకంతో శివసత్తులు చిందు లేశారు. దిలావర్‌పూర్‌ వీడీసీ సభ్యులు, హిందూవాహి ని సభ్యులు అమ్మవారిని గ్రామం నుంచి సాగనంపే వరకు వలంటీర్లుగా సేవలందించారు. నగలను దేవాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు. దీంతో జాతర ముగి సింది. ఆదివారం వేకువ జామున నుంచి ఉమ్మడి ఆదిలా బాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి నాందేడ్‌, చంద్రాపూర్‌ జిల్లాల నుంచి సై తం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి పెరు గన్నం నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. అడెల్లి మహా పోచమ్మ జాతరకు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఆలయ చైర్మన్‌ ఐటీ చందు, ఇన్‌చార్జి ఈవో రంగ రవికిషన్‌ గౌడ్‌ వలంటర్లను నియమించారు. తాగునీటి ఎద్దడి లేకుండా ఆలయ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై కృష్ణ సాగర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును నిర్వహించారు. అల్లోల మురళీధర్‌ రెడ్డి, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డితోపాటు పలువురు ప్రత్యేక పూజలు చేశారు.

Read more