మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-22T03:37:22+05:30 IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని జడ్పీబాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ఆత్రంసక్కుతో కలిసి హరితహారం నిర్వహిం చారు.

మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలి
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 21: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని జడ్పీబాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ఆత్రంసక్కుతో కలిసి హరితహారం నిర్వహిం చారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావ రణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. హరితహారంలో భాగంగాజిల్లాలో పెద్దఎత్తున మొక్కలునాటే కార్యక్ర మం చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా హరిత హారంలో భాగంగాపాఠశాలలో250మొక్కలు నాటారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌, ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read more