అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రణాళికలు

ABN , First Publish Date - 2022-06-07T06:43:10+05:30 IST

పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం భీంసారి శ్మశాన వాటికతో పాటు భాగ్యనగర్‌, క్రాంతినగర్‌ కాలనీలో పర్యటించారు.

అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రణాళికలు
పట్టణంలోని ఓ వార్డులో తిరిగి వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌

పట్టణ ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 6: పట్టణంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం భీంసారి శ్మశాన వాటికతో పాటు భాగ్యనగర్‌, క్రాంతినగర్‌ కాలనీలో పర్యటించారు. మొదటగా భీంసారి వైకుంఠధామాన్ని సందర్శించి ఇక్కడ పరిశుభ్ర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం భాగ్యనగర్‌, క్రాంతినగర్‌ కాలనీలో తిరుగుతు వార్డు సమస్యలను తెలుసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కుతో పాటు ఇతర స్థలాలను సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు తయారు చేశామన్నారు. నిధులను వెచ్చించి ప్రాధాన్య క్రమంలో పనులను చేపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, కమిషనర్‌ శైలజ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అజయ్‌, నాయకులు కొండ గణేష్‌, తదితరులున్నారు.

తలమడుగు: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా అన్నారు. సోమవారం మండలంలోని రత్నాపూర్‌, కప్పర్‌దేవి, పల్సి(బి), కుచ్లాపూర్‌ తదితర గ్రామాల్లో చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పల్లె ప్రగతి పనుల్లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. కాగా రత్నాపూర్‌ గ్రామానికి అదనపు కలెక్టర్‌ ద్విచక్ర వాహనంపె వెళ్లి గిరిజన సమస్యలను తెలుసుకోవడం గమనార్హం.  ఆ తర్వాత పలు గ్రామాలను సందర్శించిన సమస్యలను తెలుసుకున్నారు. ఇందులో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీవోదిలీప్‌కుమార్‌, రత్నాపూర్‌ సర్పంచ్‌ పెందూరురాంబాయి, ఝరి సర్పంచ్‌ రఘు, కుచ్లాపూర్‌ సర్పంచ్‌ మోహితే ప్రభ, తదితరులున్నారు.  

బజార్‌హత్నూర్‌: మండలంలో నిర్వహిస్తున్న ఐదో విడత పల్లెప్రగతి పనుల ను పకడ్బందీగా నిర్వహించాలని ఏడీఆర్‌డీవో రవీందర్‌ అన్నారు. సోమవారం మండలంలోని జాతర్ల గ్రామంలో చేపడుతున్న పల్లెప్రగతి పనులను, నర్సరీలను పరిశీలించారు. ఇందులోలో ప్రత్యేకాధికారి పుష్పలత, హెచ్‌ఆర్‌ రశీధ్‌, ఏపీవో  శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి నవనీత, తదితరులు పాల్గొన్నారు. 

సిరికొండ: పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దూరం అవుతాయ ని సర్పంచ్‌ ఓరుగంటి నర్మదాపెంటన్న అన్నారు. సోమవారం పల్లెప్రగతి కార్యక్ర మంలో భాగంగా నాల్గవ రోజు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఎంపీటీసీలు, పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేశారు. స్థానిక మహలక్ష్మీ ఆలయ పరిసరాలలో చెత్తాచెదారం తొలగించారు. ఇందులో తహసీల్దార్‌ సర్పరాజ్‌ నవాజ్‌, ఆర్‌ఐ యజ్వేందర్‌రెడ్డి, ఎంపీటీసీ పర్వీన్‌ లతీఫ్‌, ఉపసర్పంచ్‌ తోకల చిన్న రాజన్న, మండల సిరి సంపదల చైర్మన్‌ ప్రకాష్‌, తదితరులున్నారు. 

ఉట్నూర్‌: పల్లెప్రగతిలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిఽధులు శ్రమదానం నిర్వహించారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో తిరుమల, ఎంపీపీ వైస్‌ ఎంపీపీలు పంద్రాం జైవంత్‌ రావ్‌, దావులూరి బాలాజీ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఇందులో పంచాయతీ ఈవో శంకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్‌, కోఆప్షన్‌ సభ్యుడు రషీద్‌, ధరణి రాజేష్‌, కార్యాలయ సిబ్బంది పాలొన్నారు.

Updated Date - 2022-06-07T06:43:10+05:30 IST