భక్తిశ్రద్ధలతో బోనమెత్తిన జనం

ABN , First Publish Date - 2022-07-18T06:49:23+05:30 IST

జిల్లాలో ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి బోనాల సందడితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని అశోక్‌రోడ్డులోని ఆలయం, సంజయ్‌నగర్‌, మహాలక్ష్మివాడ అమ్మవారి ఆలయాలు ప్రజలతో సందడి నెలకొంది. ఆషాడమాసాన్ని పుర స్కరించుకుని మహిళలు ఈ ఆదివారం పెద్దఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు నాయకులు నెత్తిన బోనాలు ఎత్తి సందడి చేశారు.

భక్తిశ్రద్ధలతో బోనమెత్తిన జనం
ఆదిలాబాద్‌లో బోనాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్న మహిళలు

గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

అంతటా ఆధ్యాత్మిక శోభ

ఆదిలాబాద్‌ అర్బన్‌, జూలై 17: జిల్లాలో ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి బోనాల సందడితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని అశోక్‌రోడ్డులోని ఆలయం, సంజయ్‌నగర్‌, మహాలక్ష్మివాడ అమ్మవారి ఆలయాలు ప్రజలతో సందడి నెలకొంది. ఆషాడమాసాన్ని పుర స్కరించుకుని మహిళలు ఈ ఆదివారం పెద్దఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు నాయకులు నెత్తిన బోనాలు ఎత్తి సందడి చేశారు. సంజయ్‌నగర్‌ మార్వాడి ధర్మశాలలో అఖి లగాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక బోనాల పండుగ నిర్వహించగా ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నాయకులు పా యల శంకర్‌, సుహాసినిరెడ్డిలు ముఖ్య అతిథులుగా ప్రజలతో మమేకమై పాల్గొని శోభాయాత్రలో బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ భక్తి పారవశ్యంతో ముందుకు సాగారు. అశోక్‌రోడ్డులోని అమ్మవారి ఆలయంలో మొక్కులు సమర్పించుకున్నారు. బోనాల శోభాయాత్రలో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జైనథ్‌: మండలంలోని ఆయా గ్రామాలతో పాటు జైనథ్‌లో ప్రతీ సం వత్సరం మాదిరిగానే ఆదివారం ఆషాడం (ఆకడి) బోనాల ఉత్సవాలను మహిళలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో గల గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల్లో మహిళలు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ప్రజలు పాడి పంటలతో చల్లంగా ఉం డాలని మేకలు, కోళ్లను గ్రామ దేవతలకు బలిచ్చారు. ప్రజలకు వర్షాకాలం లో ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా పిల్లపాపలతో చల్లంగా ఉం డాలని వేడుకున్నారు. ఉదయం ఆయా ఆలయాల్లో మహిళలు, భక్తుల తాకిడితో గ్రామ దేవతల ఆలయాలు కిటకిటలాడాయి.

తలమడుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం బో నాల పండుగ. ఈ పండుగను ఆదివారం ఆదిలాబాద్‌జిల్లా తలమడుగు మండలం  సుంకిడిలో ఘనంగా భక్తీ శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉద యం నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేపట్టి గ్రామంలో ప్రతీ ఇంటిలోని ఆడపడుచులు యువతులు చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రధానవీధుల గుండా డప్పుచప్పుళ్లతో భాజాభజంత్రీలతో పోతరాజుల ఆటపాటలతో ఊరి శివారులో ఉన్న పోచమ్మ ఆలయానికి చేరుకుని భక్తితో మొక్కులు మొక్కి నైవేద్యాలను సమర్పించారు. కాగా, మహిళలతో పాటు కలిసి గ్రామ సర్పంచ్‌ గెల్లా మహేందర్‌ బోనం ఉన్న మట్టి పాత్ర ను ఎత్తుకొని భక్తితో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిలో ముందడుగులో ఉందన్నారు. ప్రజలందరూ కలిసి ఒకేచోట మొక్కులు సమర్పించడం సం తోషకరమని ఆయన తెలిపారు. ఈ బోనాల పండుగకు ఊరంతా కలిసి ఒకేరోజు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఉద్యోగ ఉపాధి రీత్యా, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ బోనాల పండుగకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటీవలనే ఈ ఆలయాన్ని రూ.13లక్షల వ్యయంతో నూతన ఆలయం, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గెల్ల మహేందర్‌, ఎంపీటీసీ గౌరమ్మ వెంకన్న, మండల టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు మగ్గిడి ప్రకాష్‌, ఆశన్న, స్వామి, దేవారెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకన్న, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read more