అనుమానాస్పద స్థితిలో పాలేరు మృతి

ABN , First Publish Date - 2022-02-23T06:09:19+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన ముథోల్‌లో మంగళవారం అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో పాలేరు మృతి
శవంతో బైఠాయించిన మృతుడి కుటుంబ సభ్యులు

న్యాయం చేయాలని మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన 

ముథోల్‌, ఫిబ్రవరి 22 : నియోజకవర్గ కేంద్రమైన ముథోల్‌లో మంగళవారం అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముథోల్‌ ఎస్‌ఐ తిరుపతి, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మృతుడు సాయినాథ్‌ (27) ముథోల్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద పాలేరు గా పనిచేస్తున్నాడు. అయితే రెండు రోజులుగా సాయినాథ్‌ పనికి రాకపోవడంతో మంగళవారం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి యజమాని తీసుకెళ్లాడు అంత లోనే సాయినాథ్‌ అనుమానస్పదస్థితిలో గాయాలపాలు కావడంతో స్థానిక ఆస్ప త్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి చేరుకొని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వినోద్‌రెడ్డి, ఎస్‌ఐ తిరుపతి సముదాయించినప్పటికీ వారు వినిపించుకోలేదు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి కుటుంబీకులు బంధువులు తీసుకొని వచ్చి మృతదేహంతో యజమాని ఇంటి ముందర ఆందోళన చేపట్టారు. మృతుని కు టుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ, ఎస్‌ఐలు పోలీసులు సిబ్బందితో భారీసంఖ్యలో తరలివచ్చి ఆందో ళన కారులను సముదాయించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని శవపంచనామా కోసం భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. 


Read more