వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-02-19T06:10:03+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో 2022-23 ఆర్థిక సంవత్సరం మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంను నిర్వహించారు.

వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 18: మున్సిపల్‌ పరిధిలోని ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో 2022-23 ఆర్థిక సంవత్సరం మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఆదాయ వనరులకు ప్రణాళికలతో పెంపుదల చేసుకోవాలని ఆస్థిపన్నులను వందశాతం వచ్చే మార్చి 31లోగా వసూలు చేయాలన్నారు.2022-23 ఆర్థిక సంవత్సరంకు రూ.8వేల 784.11లక్షల రూపాయలతో మున్సిపల్‌ బడ్జెట్‌ప్రవేశ పెట్టి ఆమోదించడం జరిగిందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనా వ్యయంను మార్చి నెలకు రూ.7.30లక్షల మిగులు ఆదాయంగా బడ్జెట్‌లో చూపెట్టడం జరిగిందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్‌ల అం చనా ఆదాయం రూ.5వేల 765లక్షలు కాగా 3011.81లక్షల రూపాయలు సాధారణ నిధుల అంచనా వ్యయంగా నిర్ణయించామన్నారు.  ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ శైలజ,  ఈఈ వెంకటశేషయ్య, అధికారులు పాల్గొన్నారు.

డీడీలు చెల్లించిన వారికే వేలంలో అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌స్వగృహా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వేలంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హైవేకు ఆనుకుని ఉన్న 3 ప్లాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ పేరు మీద డీడీలు తీసిన బిడ్డర్లకు మాత్రమే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు.శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రాజీవ్‌స్వగృహ కమర్షియల్‌ ఓపెన్‌ ప్లాట్లపై బహిరంగ వేలంకు సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు గతంలో డీడీలు రూ.3వేలు, రూ.5వేలు చెల్లించిన వారితో పాటు  ప్రస్థుతం 3 ప్లాట్ల వేలంలో పాల్గొనే బిడ్డర్లు సీ1, సీ2, సీ3 ప్లాట్లకు గాను రూ.10వేల చొప్పున డీడీలు తీయాలని సూచించారు. సీ1 ప్లాటుకు గాను డీడీలు తీసిన వారు అందులో రాని యెడల సీ2,సీ3 ప్లాట్లకు గాను వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అయితే సీ 1, సీ2, సీ3 ప్లాట్లు కావాలనుకునే వారు రూ.10వేల చొప్పున వేరు వేరుగా డీడీలు తీయాల్సి ఉంటుందని  అన్నారు. ఇందులో భాగంగా నోడల్‌ అధికారి అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా రాజీవ్‌ స్వగృహా ప్లాట్ల వేలం మొదటి విడతగా అవగాహన కల్పించడం జరిగిందని తిరిగి రెండవ విడతలోను అవగాహన సదస్సును ఈ నెల 23, తిరిగి మార్చి 3న, 7న అవగాహన సదస్సులు ఉంటాయని ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరారు. వేలం మార్చి 14న జడ్పీ సమావేశ మందిరంలోనే వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే ఈ ప్లాట్లు పొందిన వారు మూడు వాయిదాల పద్ధతిలో తమ సొమ్మును చెల్లించవచ్చని, మొదటి వాయిదా వారంలోగా, తిరిగి రెండవ వాయి దా 45 రోజులకు, 3వ వాయిదా 90రోజులకు తప్పని సరిగా చెల్లించాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-02-19T06:10:03+05:30 IST