వృద్ధాప్యంలో ఆసరాగా పింఛన్లు

ABN , First Publish Date - 2022-09-30T06:38:22+05:30 IST

వృద్ధులకు ఆసరాగా నిలవ డానికి 57 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పింఛన్లను మంజూ రు చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.

వృద్ధాప్యంలో ఆసరాగా పింఛన్లు

ఆదిలాబాద్‌అర్బన్‌, సెప్టెంబరు 29: వృద్ధులకు ఆసరాగా నిలవ డానికి 57 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పింఛన్లను మంజూ రు చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితులను అదిగమించి సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశా రు. పట్టణ పరిధిలోని ఆసరా పెన్షన్‌ నూతన లబ్ధిదారులకు గురు వారం ఆసరా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషాషేక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌లతో కలిసి లబ్ధిదారు లకు కార్డులను పంపిణీ చేశారు. 2737 మందికి పింఛన్‌ కార్డులు పం పిణీ చేశారు. ఈ సందర్భ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ధరికి చేరవేస్తూ సమర్థ వంతమైన పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌ మాట్లాడుతూ వార్డుల వారీగా నియమించిన ప్రత్యే క అధికారులు, కౌన్సిలర్లు కార్డులను పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీచైర్మన్‌ అడ్డిభోజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, కమిషనర్‌ శైలజ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు అలాల్‌ అజయ్‌లతో పాటు పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, పాల్గొన్నారు.

Read more