ఆదివాసీ గ్రామాల రోడ్లపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-12T01:28:23+05:30 IST

భారీ వర్షాల కారణంగా ఆదివాసీ గ్రామాల రోడ్లు అస్తవ్యస్థంగా, మరి కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయని, అయినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ సోయం బాపురావు ప్రశ్నించారు.

ఆదివాసీ గ్రామాల రోడ్లపై నిర్లక్ష్యం
రోడ్లను పరిశీలిస్తున్న ఎంపీ సోయం బాపురావు

మావల, నవంబరు 11: భారీ వర్షాల కారణంగా ఆదివాసీ గ్రామాల రోడ్లు అస్తవ్యస్థంగా, మరి కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయని, అయినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ సోయం బాపురావు ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని మామిడిగూడ, శంకర్‌లొద్ది గ్రామాల్లో పర్య టించి రోడ్లను పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటాయి కానీ, మారుమూల గ్రామాలకు రోడ్డు మర మ్మతులు చేయించడానికి ఉండవన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రోడ్ల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథ కాల ద్వారా నేరుగా నిధులు మంజూరు చేయిస్తానని భరోసా కల్పించారు. అనం తరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల కు కనీసం అంబులెన్స్‌ వెళ్లలేని పరిస్థితిలో రోడ్లు ఉన్నాయంటే ఆదివాసీల గ్రామాలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. ఇందులో జిల్లా నాయకులు మహేందర్‌, దయాకర్‌, చిత్రు పటేల్‌, సేకు పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:28:27+05:30 IST