వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-02T04:04:19+05:30 IST

మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో భక్తులకు అన్నదానం చేశారు.

వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

సిర్పూర్‌(టి), అక్టోబరు 1:  మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సంద ర్భంగా ఉత్సవకమిటీసభ్యులు ఎమ్మెల్యేను సన్మానిం చారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌, ఉపసర్పంచ్‌ తోట మహేష్‌, ఆలయ చైర్మన్‌ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Read more