అబద్దాల మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-12-30T22:28:40+05:30 IST

ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అబద్దాల మంత్రి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అబద్దాల మంత్రి హరీష్‌రావు

బెల్లంపల్లి, డిసెంబరు 30: ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అబద్దాల మంత్రి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్‌రావు రైతుల మోటార్లకు మీటర్లు బిగించనందుకు కేంద్ర ప్రభు త్వం రూ.36 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేంద్రం నిలిపివేసిందని అనడం అసత్యమన్నారు. కేంద్రంపై అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణకు తెలంగాణ ఎంపీలు చేతులెత్తి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. సింగరేణి డీఎంఎఫ్‌టీ నిధులను హరీష్‌రావు సొంత నియోజకవర్గానికి తరలించుకుని రూ.10 కోట్లతో ఫుట్‌బాల్‌ స్టేడియం కట్టిస్తున్నారని ఆరోపించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుదర్శన్‌గౌడ్‌ను నియమించినట్లు తెలిపారు. ఏమాజీ, రమేష్‌, రాజ్‌కుమార్‌, కేశవరెడ్డి, తిరుపతి, గోవర్ధన్‌, సంతోష్‌కుమార్‌, రాజులాల్‌యాదవ్‌, కృష్ణదేవరాయ లు, శ్రీనివాస్‌, రాజనర్సు, రాంచందర్‌, రాజలింగు, బలరాం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T22:28:40+05:30 IST

Read more