ట్రిపుల్‌ ఐటీకి మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు

ABN , First Publish Date - 2022-09-27T06:34:15+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీని సోమవారం మంత్రి కేటీఆర్‌ సందర్శించి హమీల వర్షం కురిపించారు.

ట్రిపుల్‌ ఐటీకి మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు
విద్యార్థుల వందనం స్వీకరిస్తున్న మంత్రి కేటీఆర్‌

పలు సమస్యల పరిష్కారానికి హామీ 

ట్రిపుల్‌ ఐటీలో మినీ టీ హబ్‌ 

వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్‌ ల్యాబ్‌ 

రూ. 3 కోట్లతో స్టేడియం 

ఆరు నెలలకు ఒకసారి వస్తానని వెల్లడి 

ఐఐటీ, నీట్‌స్థాయిలో ట్రిపుల్‌ ఐటీ అభివృద్ధికి హామీ 

బాసర, సెప్టెంబరు, 26 : బాసర ట్రిపుల్‌ ఐటీని సోమవారం మంత్రి కేటీఆర్‌ సందర్శించి హమీల వర్షం కురిపించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, యువజన క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించి హెలిక్యాప్టర్‌లో ట్రిపుల్‌ ఐటీకి చేరుకున్న మంత్రులు రెండు గంటల పాటు గడిపారు. విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనం చేశారు. మెస్‌లను, అందులో ఉండే బాత్‌రూంలను సైతం కేటీఆర్‌ పరిశీలించారు. కొత్తమెస్సే ఇలా ఉంటే పాత మెస్సు ఇంకేలా ఉంటుందని అన్నారు. బాత్‌రూం కూడా సరిగా లేదని చెప్పారు. ఇక్కడ సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పదవ తరగతిలో టాపర్సే ఎంపికయ్యే ట్రిపుల్‌ ఐటీ ప్రాముఖ్యత అందరికి తెలిసిందేనని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీని ఐఐటీ, నీట్‌ స్థాయికి అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు. వివిధ వసతుల గురించి హమీ ఇవ్వడమేగాక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ విద్యార్థులకు గుర్తుచేశారు. యూనివర్సిటీ మీ ఆస్తి మన ఇంటివలే కాపాడుకోవాలని పట్టలేనితనం, జిమిదారు లేని తనం ఉండకూడదని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వసతి సౌకర్యాలను భవిష్యత్తు విద్యార్థి తరాలకు ఉపయోగపడేలా కాపాడుకోవాలని చెప్పారు. దాదాపు విద్యార్థులతో భోజనం చేయడమే కాకుండా ఒక మంత్రిగా మరిచిపోయి వారితో ఉల్లాసంగా గడిపారు. అడిగిన విద్యార్థులందరికి సెల్పీలు దిగుతూ ఒక్కొక్కరు రూ. 500లు ఇవ్వాలంటూ విద్యార్థులకు నవ్వులు పూయించారు. విద్యార్థుల సమస్యలకుహమీలిస్తూనే మరోపక్క వారి బాఽధ్యతలను గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం కోట్లాడిన మీరు యూనివర్సిటీని, ఈ ఆస్తులను, వసతులను కాపాడుకోలేరా అంటూ విద్యార్తులకు సూచించారు.  ఇన్ని వేల మంది విద్యార్థులు నెలలో ఒకసారి, రెండు సార్లు శ్రమదానం చేసి యూనివర్సిటి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చుగదా అంటూ సూచించారు. ప్రసంగం ప్రారంభంలోనే విద్యార్థులు ఆడిటోరియంలో నేలపై కూర్చుండడాన్ని ఇదేం బాగా లేదంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మళ్లీ వచ్చే సరికి ఆడిటోరియంలో ఫిక్స్‌డ్‌ కూర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేలపై కూర్చున్న విద్యార్థుల వ ద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్‌తో పాటు మిగితా మంత్రులు నేలపైనే కూర్చున్నారు. 

అంతకుముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చినహమీ మేరకు మంత్రి కేటీఆర్‌ను క్యాంపస్‌కు తీసుకవచ్చినట్లు చెప్పారు. 

ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో మినీ టీహబ్‌ 

ట్రిపుల్‌ ఐటీలో మినీ టీహబ్‌ ఏర్పాటుకు మంత్రి హమీ ఇచ్చారు. మినీ టీహబ్‌ ఏర్పాటు కోసం దానికి ఎన్ని పైసల్‌ అవుతాయో చెప్పండి ఏర్పాటు చేసి అప్పగిస్తా మని ప్రకటించారు. ఇందులో ఇన్నోవేషన్‌ వారోత్సవాలు జరగాలి. జిల్లాలో సైన్స్‌ ఫేర్‌ మాదిరిగా కాకుండా ప్రొడక్స్ట్‌ వచ్చేలా ఉండాలని సూచించారు. ఇన్నోవేషన్‌ అంటే ఏదో పెద్ద సంస్థలల లాగా ఉహించుకోకండి మన జీవన విధానాన్ని సుల భం పద్దతులనే ఇన్నోవేషన్‌ కిందికి వస్తాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌తో సంస్థ లు ఏర్పడి సంపద సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. అమెరికా లోని ఎంఐటీ నుంచి ఆవిష్కరణలు నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని ఉదాహరిస్తూ చెప్పారు. 

కేటీఆర్‌ ఇచ్చిన హామీలు 

ఫ రెండు నెలల్లో విద్యార్థులకు లాప్‌టాప్‌ల అందజేత

ఫ వెయ్యి కంప్యూటర్‌లతో డిజిటల్‌ ల్యాబ్‌ ఏర్పాటు 

50 మాడ్రన్‌ తరగతుల ఏర్పాటు 

ఆడిటోరియం ఆధునికీకరణ 

రూ. 3 కోట్లతో మినీస్టేడియం నిర్మాణం..ఆరు నెలల్లో పూర్తి 

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు 

వసతి సౌకర్యాల మెరుగుకు చర్యలు   

Read more