మండల అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-11-18T22:20:23+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 18: అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అరిగెల మల్లిఖా ర్జున్‌ ఆధ్యక్షతన మండల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు.

మండల అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 18: అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అరిగెల మల్లిఖా ర్జున్‌ ఆధ్యక్షతన మండల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఐసీడీఎస్‌ అధికారులు ప్రోటోకాల్‌ పాటించడంలేదని ఎంపీపీ మల్లికార్జున్‌, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మిషన్‌ భగీరథ నీరు అయాగ్రామాలకు సక్రమంగా అంద డం లేదని, పలుచోట్ల లీకేజీలు ఏర్పడిన ప్పటికీ మరమత్తులు చేపట్టడంలేదని ఎం పీపీ, జడ్పీటీసీలతో సహ పలువురు సభ్యులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండలంలోని ఈదులవాడ, రహపల్లి, అప్పపెల్లి, పాడిబండ తదితర గ్రామాల్లో క్రీడామైదానం కోసం స్థలాలు కేటాయించాలని సర్పం చులు భీమేష్‌, శ్రీనివాస్‌, బాబురావు, దిన్‌కర్‌ తహసీ ల్దార్‌ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అధికారులు తమతమ శాఖల పనితీరు వివరించారు. కార్యక్రమం లో నీటిపారుదలశాఖ ఈఈ గుణవంత్‌రావు, ఎంపీడీవో శశికళ, మీషన్‌భగీరథ డీఈఈలు ఇర్ఫాన్‌, మథీన్‌, ఏపీఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వాంకిడి: మండలపరిషత్‌ కార్యాలయంలో శుక్ర వారం ఎంపీపీ ముండె విమలాబాయి అధ్యక్షతన జరిగిన సర్వసభ్యసమావేశానికి జడ్పీటీసీ అజయ్‌కు మార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతీ సమావేశా నికి పలుశాఖల అధికారులు గైర్హాజరు అవుతున్నా రని అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతీ మండల సమావేశంలో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడం తరువాత వాటిని మర్చిపోవడం ఆన వాయితీగా మారిందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో మిషన్‌ భగీరథ, ఐసీడీఎస్‌, ఇరిగేషన్‌, విద్యావ్యవస్థల పనితీరు సరిగాలేదని, పాఠ శాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోఽధించకుం డా సెల్‌ఫోన్‌చూస్తూ కాలక్షేపంచేస్తున్నారని కోమటి గూడ, పాటగూడ సర్పంచులు రాయిసిడాం మంగళ, కోట్నకకిష్టు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండ లంలోని పలుగ్రామాల్లో రైతులకు తెలియకుండానే విద్యుత్‌టవర్‌లు ఏర్పాటు చేస్తున్నారని రైతులకు నష్టపరిహారం అందించడంలేదని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బంబారచెరువు మరమత్తులు చేయకుండానే కాంట్రాక్టర్‌ బిల్లులు స్వాహా చేశాడని దానిపై విచారణ జరపాలని సర్పంచు సయ్యద్‌ అయ్యూబ్‌ కోరారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కా రానికి కృషిచేస్తామని ఎంపీపీ విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ సభ్యులకు సూచించారు.

Updated Date - 2022-11-18T22:20:23+05:30 IST

Read more