రేపు మెగా సదరం క్యాంపు

ABN , First Publish Date - 2022-12-02T00:48:25+05:30 IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐటీడీఏ ఆధ్వ ర్యంలో దివ్యాంగుల మెగా సదరం క్యాంపును నిర్వహిస్తు న్నట్లు ఐటీడీఏ పీవో కె.వరుణ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు మెగా సదరం క్యాంపు

బోథ్‌రూరల్‌, డిసెంబరు 1: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐటీడీఏ ఆధ్వ ర్యంలో దివ్యాంగుల మెగా సదరం క్యాంపును నిర్వహిస్తు న్నట్లు ఐటీడీఏ పీవో కె.వరుణ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన దివ్యాంగులు ఉట్నూర్‌ సీహెచ్‌సీలో హాజరయ్యే వారు మీ సేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులుగా ఉండి ఇప్పటి వరకు సదరం క్యాంపునకు హాజరు కాని వారు మాత్రమే ఈ క్యాంపుకు హాజరు కావాలని సూచించారు. స్లాబ్‌ బుకింగ్‌ పత్రం, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఇతర సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T00:48:27+05:30 IST