‘మలేరియా’ కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2022-06-08T04:12:34+05:30 IST

మలేరియా మహామ్మారి ప్రభావిత ప్రాంతాల జిల్లాల్లో కుమరం భీం ఆమలేరియా మహామ్మారి ప్రభావిత ప్రాంతాల జిల్లాల్లో కుమరం భీం ఆసిఫాబాద్‌ కూడా ఉన్నట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. ఏజెన్సీ ప్రాంతమైన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో యేటా వర్షాకాలం మలేరియా సంబంధిత విష జ్వరాలు ప్రబలుతుం డడంతో ఇదీ వైద్యాధికారులకు సవాలుగా మారింది.

‘మలేరియా’ కట్టడికి చర్యలు
లోగో

- దోమల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయం

- ‘పల్లె ప్రగతి’లో పారిశుధ్యంపై ఫోకస్‌

- కట్టడి చర్యలు చేపట్టినా గత ఏడాది 75 కేసులు

-  జిల్లాలో 63 ఆవాసాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తింపు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మలేరియా మహామ్మారి ప్రభావిత ప్రాంతాల జిల్లాల్లో కుమరం భీం ఆమలేరియా మహామ్మారి ప్రభావిత ప్రాంతాల జిల్లాల్లో కుమరం భీం ఆసిఫాబాద్‌ కూడా ఉన్నట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. ఏజెన్సీ ప్రాంతమైన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో యేటా వర్షాకాలం మలేరియా సంబంధిత విష జ్వరాలు ప్రబలుతుం డడంతో ఇదీ వైద్యాధికారులకు సవాలుగా మారింది. ఎన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నా ఏజెన్సీ మండలాల్లో మలేరియా భూతం పంజా విసురుతుండడంతో ఈ దఫా ఈ వ్యాధిని సమర్థవంతంగా నిరోధించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. తాజా గా జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో మలేరియాకు కారణమయ్యే అపరిశుభ్ర పరిస్థితులను రూపు మాపేందుకు ప్రత్యేక చర్యలు ప్రారం భించారు. ముఖ్యంగా మలేరియా ప్రబలే అవకాశం ఉన్నట్టు అనుమాని స్తున్న అవాసాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టేలా కార్యాచరణ తయారు చేసింది. అలాగే గ్రామాల్లో పారిశుధ్యంపై ఎక్కువ ఫోకస్‌ చూపేలా జిల్లా అధికార యంత్రాంగం ఆయా మండలాల అధికారులను పురమాయించింది. 

జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లోని 1089 ఆవాసాల్లో పారిశుధ్య నిర్వహణపై పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా రు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జూన్‌ 15న మలేరియా ఇతర విష జ్వరాల నియంత్రణపై ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారి చెబుతున్నారు. మలేరియాతో పాటు బోదకాలు వంటి వాటికి కారణమైన క్యూలెక్స్‌  దోమల నియం త్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్టు జిల్లా మలేరి యా అధికారి సుధాకర్‌ నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. గత అను భవాలను దృష్టిలో పెట్టుకొని ఈ దఫా ముందుగానే వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాం తాలు, మురికి వాడల్లో దోమల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చేలా సంబంధిత పంచాయతీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. గత ఏడాది కట్టడి చర్యలు చేపట్టినా ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 75 మలేరియా కేసులు నమోదు అయ్యా యి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఆ కేసులు వెలుగు చూసిన గ్రా మాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

దోమల వల్ల వ్యాపించే..

మలేరియా అనేది దోమల వల్ల వ్యాపించే ఒక ప్రాణాంతకమైన వ్యాధి.  ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. దోమలు  ఈ వ్యాధికి వాహకాలుగా పని చేస్తాయి. దీన్ని కట్టడి చేసేందుకు ఏజెన్సీ లో దోమల నియమంత్రణ కోసం చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది మలేరియా తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న ఆవాసాలను గుర్తించి జాబితా రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం  జిల్లాలో ఆరు ప్రాథమిక కేంద్రాల పరిధిలోని 63 ఆవాసాలను హై రిస్కు జోన్‌లుగా గుర్తించారు. ఇందులో భట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో-8 ఆవాసాలు, అడ ప్రాథమిక కేంద్రం పరిధి మూడు ఉపకేంద్రాల పరిధిలో 27 ఆవాసాలను హైరిస్కుగా గుర్తించారు. ఇందులోను అడదశ్నాపూర్‌లో 8 ఆవాసాలను గుర్తించారు. మోవాడ్‌ పరిధిలో పది, వావడం  పరిధిలో ఐదు ఉన్నాయి.  కెరమెరి పీహెచ్‌పీ పరిధిలోని పట్నాపూర్‌  సబ్‌సెంటర్‌ పరిధిలో పది గ్రామాలు ఉన్నాయి. గిన్నెధరి పీహెచ్‌సీ పరిధిలోని డోర్లి సబ్‌ సెంటర్‌ కింద ఉన్న ఐదు ఆవాసాలు, తిర్యాణి పీహెచ్‌సీ పరిధిలోని గంభీరా వుపేట  సబ్‌ సెంటర కింద ఏడు ఆవాసాలను హైరిస్క్‌గా గుర్తించారు. రొంపెల్లి పీహెచ్‌సీ పరిధిలోని పది ఆవాసాల చొప్పున మొత్తం 63 ఆవాసాలను గుర్తించారు. 


మలేరియా నియంత్రణకు చర్యలు..

- మనోహర్‌, జిల్లా వైద్యాధికారి 

ఏజెన్సీ ప్రజలను పీడిస్తున్న మలేరియాను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుటోంది. కుమరం భీం ఆసిఫా బాద్‌ జిల్లా హై రిస్కు జాబితాలో ఉన్నందున వర్షా కాలం ప్రారంభానికి ముందుగానే నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తు న్నాం. ఇందుకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే అవస రమైన మందు లు, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచాం. ప్రస్తుతం జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య నిర్వహణపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలని పంచాయతీ అధికారులను కోరాం. 

Updated Date - 2022-06-08T04:12:34+05:30 IST