దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు

ABN , First Publish Date - 2022-12-06T22:18:35+05:30 IST

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
బ్యాంకు రుణాన్ని అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కాగజ్‌నగర్‌, డిసెంబరు 6: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఆదర్శ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దివ్యాంగులు సమాజంలో ఒకరిపై ఆధారపడి ఉంటారన్నారు. వీరిని ఎవరూ కూడా చిన్నచూపు చూడకూడదని చెప్పారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టి పెన్షన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. అనంతరం దివ్యాంగుల అభివృద్ధి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరిష్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి సావిత్రి, డిస్ట్రిక్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ మోతీరాంతో పాటు దివ్యాంగులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు అజీజ్‌, సుబ్బలక్ష్మి, భవిత కేంద్రం నిర్వహకురాలు స్రవంతి, వికలాంగుల సంఘం నాయకులు రవిశంకర్‌, రాజేందర్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండల కేంద్రంలోని ఎంపీపీఎస్‌ స్కూల్‌లో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి, హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఎస్‌ఏ శ్రీనివాస్‌, ఫిజియో థెరఫిస్ట్‌ ప్రవీన్‌, జెఎల్‌ చంద్రశేఖర్‌, సీఆర్పీ రవీందర్‌, ఐఈఆర్‌పీఎస్‌ చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:18:37+05:30 IST