టూరిజం అభివృద్ధి కోసం చర్యలు

ABN , First Publish Date - 2022-09-25T04:26:48+05:30 IST

జిల్లాలో టూరిజం అభి వృద్ధికి అన్నిచర్యలు తీసుకుంటు న్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి తెలిపారు. మండలంలోని అడ ప్రాజెక్టులోరూ.25లక్షల వ్యయంతో చేపట్టిన బోటింగ్‌ ప్రక్రియను శని వారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఐటీ డీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావుతో కలిసి ప్రారం భించారు.

టూరిజం అభివృద్ధి కోసం చర్యలు
బోట్‌లో విహరిస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెం బరు 24: జిల్లాలో టూరిజం అభి వృద్ధికి అన్నిచర్యలు తీసుకుంటు న్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి తెలిపారు. మండలంలోని అడ ప్రాజెక్టులోరూ.25లక్షల వ్యయంతో చేపట్టిన బోటింగ్‌ ప్రక్రియను శని వారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఐటీ డీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావుతో కలిసి ప్రారం భించారు. ఈసందర్భంగా ప్రాజెక్టులో బోటింగ్‌ ట్రిప్పు నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో బోటింగ్‌ ఏర్పాటు చేయ డానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. బోటింగ్‌ను జిల్లా ప్రజలు వినియోగించుకోవాల న్నారు. టూరిజం అధికారులు మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో బోటింగ్‌ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి రానుందని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.50 చొప్పున టికెట్‌ధర నిర్ణయించే అవకాశం ఉందన్నారు.

Read more