అభివృద్ధికి నోచుకోని మంచిర్యాల

ABN , First Publish Date - 2022-05-31T03:47:18+05:30 IST

మంచిర్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోక వెనుకబడి పోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నా రు. సోమవారం భవన నిర్మాణ కార్మిక సం ఘం భవనంలో ఏర్పాటు చేసిన బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో మాట్లాడా రు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

అభివృద్ధికి నోచుకోని మంచిర్యాల
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపి జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌

ఏసీసీ, మే 30: మంచిర్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోక వెనుకబడి పోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నా రు. సోమవారం భవన నిర్మాణ కార్మిక సం ఘం భవనంలో ఏర్పాటు చేసిన బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో మాట్లాడా రు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీకి శాశ్వ త డంపింగ్‌యార్డు లేక చెత్తను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారన్నారు. శ్మశాన వాటిక నిర్మించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు దళితబంధు, కొత్త పిం ఛన్‌లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయా లని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నందున జూన్‌ 1 నుంచి 14 వరకు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోదీ సాధిం చిన విజయాలను వివరిస్తారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశానికి అంతర్జాతీ య గుర్తింపు వచ్చిందన్నారు. నాయకులు వెంకటేశ్వర్‌రావు, పురుషోత్తం, జైన్‌, వాణి, రజనీ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పథకాలను ప్రజలకు వివరించాలి 

వేమనపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివ రించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మ హరీష్‌గౌడ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బైస మల్లేష్‌ అధ్యక్షతన కార్య వర్గ సమావేశం నిర్వహించారు. హరీష్‌ గౌడ్‌ మాట్లాడుతూ స్ధానిక సమస్యలపై పోరాటాలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి ప్రజ లకు వివరించాలన్నారు. మండల ప్రధాన కార్యదర్శి సంతోష్‌,  దుర్గ పుల్లయ్య, కుబిడె అంజన్న, వెంకటి, రమేష్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-31T03:47:18+05:30 IST