జోరుగా వ్యవసాయ పనులు

ABN , First Publish Date - 2022-06-13T03:43:16+05:30 IST

మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో శనివారం రాత్రి తొలకరి జల్లులు కురియడంతో రైతులు వానాకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు.

జోరుగా వ్యవసాయ పనులు
దుక్కులు దున్నుతున్న రైతు

కెరమెరి, జూన్‌12: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో శనివారం రాత్రి తొలకరి జల్లులు కురియడంతో రైతులు వానాకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు. ఆది వారం దుక్కులు దున్నారు. గతేడాది పత్తి పంటతో నష్ట పోయిన రైతులు ఈ ఏడా దైనా పంటలు సంవృద్ధిగా పండాలని ఆశగా పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో 32,267ఎక రాల్లో 6492 మంది రైతులు పంటలను సాగుచేస్తు న్నారు. ఇందులో పత్తిపంట సుమారు 28 వేల ఎకరాల్లో సాగు చేయనుండగా మిగితా ఎకరాల్లో కంది, పెసర, కూరగాయల పంట లను సాగు చేస్తున్నారు.

Updated Date - 2022-06-13T03:43:16+05:30 IST