సాహితీ దిగ్గజం సామల సదాశివ మాస్టారు

ABN , First Publish Date - 2022-04-25T05:02:12+05:30 IST

సాహితీ దిగ్గజం దివంగత సామల సదాశివ మాస్టారు అని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం సామల సదాశివ సాహితీ పురస్కారం-2022 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతవాసి రచించిన కవితలు, రచనలు కేంద్రస్థాయిలో గుర్తింపు లభించినట్టు పేర్కొ న్నారు.

సాహితీ దిగ్గజం సామల సదాశివ మాస్టారు
సామల సదాశివ పురస్కారం అందుకున్న ప్రముఖ కవి పెండ్యాల కిషన్‌ శర్మ

-సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 24: సాహితీ దిగ్గజం దివంగత సామల సదాశివ మాస్టారు అని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం సామల సదాశివ సాహితీ పురస్కారం-2022 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతవాసి రచించిన కవితలు, రచనలు కేంద్రస్థాయిలో గుర్తింపు లభించినట్టు పేర్కొ న్నారు. అంతటి మహనీయుడి పేరిట పురస్కారం ఏర్పాటు చేయటం గర్వంగా ఉందన్నారు. ప్రముఖ కవి ఆచార్యవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సామల సదా శివ మాస్టారు రచించిన రచనలు అందరికీ అర్థమ య్యేరీతిలో ఉంటాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధి కారి ఆశోక్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత రంగంలో చక్కటి రచనలు, కవితలు రాసిన మహనీయుడు సామల సదాశివ మాస్టారు అన్నారు.

సామల సదాశివ సాహితీ పురస్కారం అందజేత

సామల సదాశివ సాహితీ పురస్కారం కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన పేరొందిన కవి పెండ్యాల కిషన్‌ శర్మకి అందజేశారు. ఈసందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో తెలుగు సాహితీ సదస్సు సభ్యులు, పద్మశాలి సంఘం సభ్యులు కలిసి కిషన్‌ శర్మకు శాలువాలతో ఘనంగా సన్మానం చేసి పురస్కా రాన్ని అందజేశారు. అనంతరం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కూడా ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రముఖ కవి పెండ్యాలకిషన్‌శర్మ రచించిన వరదాభ్యుదయం పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో ప్రముఖకవులు రాంమోహన్‌, మురళీధర్‌గౌడ్‌, డాక్టర్‌ పర్వతి సత్యనారాయణ, సదాశివ మాస్టారు కుమారుడు శ్రీవర్ధన్‌, ఓపెన్‌ యూనివర్శిటి డిప్యూటీ రిజిస్ట్రార్‌ విజయ్‌, కటుకం మఽధుకర్‌, మామిడాల తిరుపతయ్య, దాసరి వెంకటేష్‌, శ్రీకాంత్‌,కొంగ సత్యనారాయణ, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-25T05:02:12+05:30 IST