రాజ్యాంగాన్ని మార్చాలన్న వారినే మార్చేద్దాం!

ABN , First Publish Date - 2022-03-05T07:14:32+05:30 IST

స్వార్ధపూరిత స్వప్రయోజనాల కోసం రాజ్యాం గాన్ని మార్చాలన్న వారి రాజకీయ అస్తిత్వాన్నే మార్చేద్దామని వంచి త్‌ బహుజన్‌ అగాడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, డా.బీఅర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని మార్చాలన్న వారినే మార్చేద్దాం!
భైంసాలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో ప్రకాష్‌ అంబేద్కర్‌

వంచిత్‌ బహుజన్‌ అగాడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాష్‌ అంబేద్కర్‌ 

భైంసా, మార్చి 4 : స్వార్ధపూరిత స్వప్రయోజనాల కోసం రాజ్యాం గాన్ని మార్చాలన్న వారి రాజకీయ అస్తిత్వాన్నే మార్చేద్దామని వంచి త్‌ బహుజన్‌ అగాడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, డా.బీఅర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం భైంసాలో నిర్వహించిన వంచిత్‌ బహుజన్‌ అగాడీ పార్టీ జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా అధికార పీఠమెక్కిన కొంతమంది.. రాజ్యాంగాన్నే మార్చాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరం కాదన్న విషయాన్ని ప్రతీఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. పాలనాధికార దర్పంతో ఏదైనా మాట్లాడితే చెల్లు బాటు అవుతుందనే భావన వీడితే అందరికీ శ్రేయస్కరంగా ఉం టుందన్నారు. దేశాన్ని అత్యధికంగా ఉన్న బహుజనుల కంటే అత్య ల్పవర్గాల వారే ఏలుతుండటంతో సమస్యలు పెరుగుతున్నాయ న్నారు. బహుజనులంతా ఐక్యతతో ముందుకు సాగితే రాజ్యాధి కారాన్ని సులభంగా హస్తగతం చేసుకోవచ్చునన్నారు. దళిత, బహు జనుల ఉద్యమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న నిర్మల్‌ జిల్లా భైంసా నుంచే ఈ పోరుబాట అరంభం కావాలని ప్రకాష్‌ అంబేద్కర్‌ ఆకాంక్షించారు. అనంతరం భైంసా బస్టాండ్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన 11అడుగుల డా.బీఅర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రకాష్‌ అంబేద్కర్‌, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు, డా.బీఅర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు కమిటీ ప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T07:14:32+05:30 IST