ఆర్డీవోను కలిసిన భూ నిర్వాసితులు

ABN , First Publish Date - 2022-05-24T05:40:51+05:30 IST

ఆర్డీవోను కలిసిన భూ నిర్వాసితులు

ఆర్డీవోను కలిసిన భూ నిర్వాసితులు

మల్హర్‌, మే 23 : జెన్‌కో ఓపెన్‌కాస్టు గనుల తవ్వకాల్లో భూములు కోల్పోయిన మండలంలోని కాపురం, తాడిచర్ల ఎస్సీకాలనీకి చెందిన వాసులు భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ను సోమవారం కలిశారు.  రెండు రోజుల క్రితం తాడిచర్లకు వచ్చిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్న విషయం విదితమే. పునరావాస లబ్ధిదారుల జాబితాలో పేర్లు గల్లంతుపై నిలదీయగా సమస్యను పరిష్కరిం చేందుకు భూపాలపల్లిలోని తమ కార్యాలయానికి రావాలని ఆర్డీవో వారికి సూచించారు. ఈ నేపథ్యంలో  భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్‌ నేతృత్వంలో కాపురం, తాడిచర్ల ఎస్సీ కాలనీకి చెందిన నిర్వాసి తులు ఆర్డీవోను కలిశారు. పునరావాసం జాబితాలో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. కాపురం గ్రామంలో 23, తాడిచర్ల ఎస్సీకాలనీలో  18 మంది పేర్లు జాబితాలో లేవని తెలిపారు. నాడు మైనర్లుగా ఉండి నేడు మేజర్‌గా మారిన యువతీ యువ కులకు పునరావాసం ప్యాకేజీ ఇవ్వాలని ఆర్డీవోను కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జెన్‌కోకు లేఖ రాసి జాబితాలో పేర్లు లేని వారి గురించి ప్రస్తావి స్తానని హామీ ఇచ్చారని రమేష్‌ తెలిపారు.  ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌కు నివేదిక పంపి పునరావాస ప్యాకేజీ ఇప్పించి న్యాయం చేస్తామని తెలిపినట్లు పేర్కొ న్నారు. అలాగే కేటీపీపీ సీఈ సిద్ధయ్యకు  భూనిర్వాసితులు వినతిపత్ర సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు సమ్మయ్య, సది, శివ, రాజయ్య, మహంకాళి, రమేష్‌, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Read more