కుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-28T05:46:52+05:30 IST

కుమరం భీం పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు హక్కుల సాధనకు ముందుసాగాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

కుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలి
కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

 - ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కెరమెరి, జనవరి 27: కుమరం భీం పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు హక్కుల సాధనకు ముందుసాగాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.  మండల కేంద్రంలో నిర్మించిన ఆదివాసీ భవన్‌తో పాటు కుమరం భీం విగ్రహాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆదివాసీలు విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వెనకబడి ఉన్నారని, అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు. ఆదివాసీల సమస్యల కోసం ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సమావేశమై నివేదిక అందజేసినట్లు ఆయన చెప్పారు. ఆదివాసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు రెండు పంటలు పండించేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా గిరిజన రైతులు సాగు చేస్తున్న పొలాల్లో విద్యుత్‌, నీటి వసతి కల్పించడం జరుగుతుందన్నారు. ఆదివాసీలు వ్యవసాయ, విద్య రంగాలపై దృష్టి సారించి ముందు సాగాలన్నారు. రైతు బంధు పథకాన్ని పెట్టుబడి పథకంగా ఉపయోగించి వ్యవసాయంలో రాణిం చాలన్నారు. అనంతరం ఆదివాసీ భవన ప్రహారి గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌ వేతనాలు ఇప్పించా లని వీవీలు ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్‌ లక్కెరావ్‌, ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ దృపతాబాయి, వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం, మహిళా కమీషన్‌ సభ్యురాలు ఈశ్వరి, గిరిజన నాయకులు తిరుపతి, మునీర్‌ అహ్మద్‌, ఉత్తంరాథోడ్‌, అంబారావు, జగన్నాథ్‌రావు, భీంరావు, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more