సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2022-10-02T03:47:20+05:30 IST

గిరిజన ఆదివాసీ లంబా డీలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. రాజ్‌కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడం సంతోషంగా ఉం దని, ప్రభుత్వం జారీ చేసిన జీవో శనివారం నుంచి అమలులోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
బూరుగుపల్లిలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

భీమారం, అక్టోబరు 1: బూరుగుపల్లిలో శనివారం చెన్నూరు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భుక్య రాజ్‌కు మార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ లంబా డీలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. రాజ్‌కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడం సంతోషంగా ఉం దని, ప్రభుత్వం జారీ చేసిన జీవో శనివారం నుంచి అమలులోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.  సర్పంచు రమాదేవి, జెడ్పీటీసీ తిరుమల లక్ష్మణ్‌నా యక్‌, రూప్లానాయక్‌, రాజేష్‌నాయక్‌, పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్‌: గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయడంపై సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పంతుల నాయ క్‌ హర్షం వ్యక్తంచేశారు. గోపాల్‌నాయక్‌, సంపత్‌ కుమార్‌, భీమానాయక్‌, వీరన్న పాల్గొన్నారు. 

కాసిపేట: సీఎం కేసీఆర్‌ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ  దేవాపూర్‌లో ఆదివాసీ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆడె జంగు, హన్మంతు, అనంతరావు పాల్గొన్నారు. 

మందమర్రిరూరల్‌: ఎస్టీ రిజర్వేషన్‌లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ అందుగులపేటలో ఆదివాసీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. వైస్‌ ఎంపీ పీ రాజ్‌కుమార్‌, లలితరాయమల్లు, పాల్గొన్నారు.  

Read more