Kinnerasani సందర్శనకు అనుమతి లేదు

ABN , First Publish Date - 2022-07-13T18:09:39+05:30 IST

పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయ సందర్శన కోసం ప్రజలను అనుమతించడంలేదని తహసీల్దార్‌ రంగా ప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ

Kinnerasani సందర్శనకు అనుమతి లేదు

పాల్వంచ/చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయ సందర్శన కోసం ప్రజలను అనుమతించడంలేదని తహసీల్దార్‌ రంగా ప్రసాద్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి మట్టం 407 అడుగులు కాగా 400.80 అడుగుల వద్ద నిలకడగా ఉంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.675 టీఎంసీలకు చేరింది. ఇన్‌ప్లో-23వేల క్యూసెక్కులుకాగా అవుట్‌ప్లో 27వేల క్యూసెక్కులు ఉంది. ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


తాలిపేరు 24 గేట్లు ఎత్తివేత

తాలిపేరు ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. వరదనీటితో ప్రాజెక్టు అతలాకుతలమవుతోంది. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేస్తున్న అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి లక్ష 81 వేల 669క్యూసెక్లు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామద్యం 0.75 టీఎంసీ కాగా ప్రస్తుత నీటి మట్టం 70 మీటర్లు. 0.50 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లక్ష 68 వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా గత 20 ఏళ్లలో జూలైలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద రావడం ఇదే ప్రథమం అని ప్రాజెక్టు అధికారులు  చెబుతున్నారు.

Updated Date - 2022-07-13T18:09:39+05:30 IST