రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ నిరంకుశ పాలన

ABN , First Publish Date - 2022-03-17T04:30:11+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ నిరంకుశ పాలన
వెల్గనూర్‌లో నినాదాలు చేస్తున్న బీజేపీ నాయకులు

 - బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి
దండేపల్లి, మార్చి 16: రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. దండేపల్లి మండలం వెల్గనూర్‌లో బుధవారం గడప గడపకు ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్‌తో కలిసి నాయకులు పర్యటించారు. ముందుగా వెల్గనూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో  పార్టీ మండల అధ్యక్ష,కార్యదర్శులు గోపతి రాజయ్య, బందేల రవిగౌడ్‌, తోడేటి హరికృష్ణ, నాయకులు మధవరపు వెంకటరమణ, తిరుపతి, రజినేష్‌జైన్‌, వెంకటకృష్ణ, శ్రీనివాస్‌, గిరిధర్‌, రవీందర్‌,ఉషన్న, శ్రీనివాస్‌, సంజీవ్‌, రాజలింగు, చింటూ, వంశీ, సత్తయ్య, రమేష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపాలటీ పరిధిలోని భరత్‌కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని పార్టీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ ప్రారంభించారు. ఈ సంధర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి కండుడా వేసి స్వాగతించారు. అనంతరం ఇటీవల గని ప్రమాదానికి గురై రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కార్మికులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌, రమేష్‌, పైడిమల్ల నర్సింగ్‌, దీక్షిత్‌, నరేష, తదితరులు పాల్గొన్నారు.  

Read more