జీవో 317ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T03:30:53+05:30 IST

జీవో నంబరు 317ను రద్దు చేయాలని ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బెజ్జూరు మండలం సోమిని బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, చింతలమానేపల్లి మండలం గూడెం జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంగళవారం సభ్యత్వం చేపట్టారు

జీవో 317ను రద్దు చేయాలి
చింతలమానేపల్లిలో సభ్యత్వ నమోదు చేపడుతున్న ఉపాధ్యాయులు

- ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

బెజ్జూరు/చింతలమానేపల్లి, అక్టోబరు 11: జీవో నంబరు 317ను రద్దు చేయాలని ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బెజ్జూరు మండలం సోమిని బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, చింతలమానేపల్లి మండలం గూడెం జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంగళవారం సభ్యత్వం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విరుద్దంగా ఉందన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టక పోవడంతో ఉపాధ్యాయులు మనోవేద నకు గురవుతున్నారన్నారు. వెంటనే జీవోను రద్దు చేసి పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోచాని, జలపతి, వెంకటేష్‌, పరమే శ్వర్‌, నందారాం, భుజంగరావు, సంతోష్‌, రమేశ్‌, రాజారాం, తదితరులు పాల్గొన్నారు. 

Read more