విద్యార్థులను పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ABN , First Publish Date - 2022-09-19T05:53:57+05:30 IST

పాఠశాలల అభి వృద్ధితోపాటు మంచి పౌరులను తీర్చిదిద్దేది ఉపాఽధ్యాయులేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నా రు.

విద్యార్థులను పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 18 : పాఠశాలల అభి వృద్ధితోపాటు మంచి పౌరులను తీర్చిదిద్దేది ఉపాఽధ్యాయులేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నా రు. ఆదివారం పీఆర్‌ టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సత్కరిం చారు. జిల్లాకేంద్రంలోని పీఆర్‌టీయూ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్ర మానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఉపాధ్యా య వృత్తి ఎంతో గౌరవ ప్రదమైందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్య త్తుకు బాటలు వేయడతోపాటు పాఠశాలల అభివృద్ధిలో కూడా కీలకంగా ఉంటున్నారన్నారు. అలా వారు చేసిన సేవలకు గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు. 52 ఏళ్ల కాలంలో పీఆర్‌టీయూ ఉపాధ్యాయులకు అండగా ఉంటూ వారికి అనుకూలంగా ప్రభుత్వాలతో పోరాడి జీవోలను తీసు కువచ్చిందన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకు మార్‌, రవీందర్‌, సత్యనారాయణ గౌడ్‌, సంతోష్‌కుమార్‌, జయశ్రీ పాల్గొన్నారు. 

Read more