వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం సరికాదు

ABN , First Publish Date - 2022-11-20T23:57:15+05:30 IST

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టడం సరికాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి మూడ శోభన్‌ అన్నారు

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం సరికాదు

దస్తూరాబాద్‌, నవంబరు 20 : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టడం సరికాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి మూడ శోభన్‌ అన్నారు. మండలంలోని బుట్టాపూర్‌ గ్రామంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కోశాధికారి నాగెల్లి నర్సయ్య అధ్యక్షతన జిల్లా రెండో మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వస్తున్న ఆదాయాన్ని దెబ్బతీసే విధానాలను కొనసాగిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏదో రూపంలో కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని, వీటి నివారణకు రుణ మాఫీ చేయమని రైతు సంఘాలు కోరుతుంటే కార్పొరేట్‌ శక్తులకు రూ.11 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వరదల వల్ల పంటలు నష్టపోతే ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనాల కోసం కాకుండా బీమా కంపెనీలకే లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఇప్ప లక్ష్మణ్‌, కార్యదర్శి డాకూరి తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌ కుమార్‌, రైతు సఘం నాయకులు ఎన్‌. లక్ష్మి, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:57:15+05:30 IST

Read more