గాలిమోటారు రాక గగనమేనా?

ABN , First Publish Date - 2022-02-23T06:25:18+05:30 IST

జిల్లాకు గాలిమోటార్‌ రావ డం గగణంగానే కనిపిస్తోంది. జిల్లావాసులు దశాబ్దాలుగా ఎదురు చూ స్తున్న విమానాశ్రయం కల నెరవేరడమే లేదు. ఇప్పటికే ఏయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారులు పలుమార్లు జిల్లాలో పర్యటించి ఏయిర్‌ పోర్ట్‌ ఏర్పాటుకు సాధ్య, సాధ్యాలను పరిశీలించారు. గత రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని పూనేకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీతో ల్యాండ్‌ సర్వే పనులను కూడా పూర్తి చేశారు.

గాలిమోటారు రాక గగనమేనా?
జిల్లా కేంద్రం వద్ద ఎరోడ్రం స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్‌)

జిల్లాలో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుపై సందేహాలు
నివేదికల పేరిట కాలయాపన
ఎన్నికల సమయంలోనే అంతా హడడావుడి
రాష్ట్ర ప్రభుత్వ లేఖతో మళ్ల్లీ తెరపైకి..
కేంద్ర సర్కారుపైనే ఆశలన్నీ..
గతంలోనే 1,500 ఎకరాల స్థల గుర్తింపు
పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎయిర్‌ఫోర్స్‌ సంస్థ
ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఆదిలాబాద్‌ అనువైనదే : ఏఏఐ సంస్థ
364 ఎకరాల స్థల సేకరణ సైతం పూర్తి
తుది నివేదిక ఇవ్వడంలో జాప్యం

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాకు గాలిమోటార్‌ రావ డం గగణంగానే కనిపిస్తోంది. జిల్లావాసులు దశాబ్దాలుగా ఎదురు చూ స్తున్న విమానాశ్రయం కల నెరవేరడమే లేదు. ఇప్పటికే ఏయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారులు పలుమార్లు జిల్లాలో పర్యటించి ఏయిర్‌ పోర్ట్‌ ఏర్పాటుకు సాధ్య, సాధ్యాలను పరిశీలించారు. గత రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని పూనేకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీతో ల్యాండ్‌ సర్వే పనులను కూడా పూర్తి చేశారు. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని దాదాపుగా 1,500 ఎకరాల స్థ లాన్ని ఎయిర్‌పోర్స్‌ కోసం గుర్తించారు. దీనికి ఎయిర్‌పోర్స్‌ సంస్థ అప్పట్లో అ భ్యంతరాలు చెప్పింది. దీంతో ద్వితీయ పట్టణాల్లో ప్రాంతీయ విమానాశ్రాయల ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. దీనికి గాను 364 ఎకరాల స్థల సేకరణ కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలలో ఆదిలాబాద్‌ కూడా అనువైనదేనని 2019 లోనే ఏఏఐ సంస్థ అధికారులు కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అందరూ భావించా రు. కాని తుది నివేదికను ఇచ్చేందుకు గత మూడేళ్లుగా జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో మళ్లీ విమానాశ్రయ ఏర్పాటు తెరపైకి వచ్చింది. ఇప్పటికే జిల్లాలో మూతపడిన సీసీఐని పునరుద్దరించాలంటూ సాధన కమిటీ ఆధ్వర్యం లో పోరాటం మొదలయ్యింది. ఇక విమానాశ్రయ ఏర్పాటుపై కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రకటనలకే పరిమితం
కేంద్ర విమానాయన సంస్థ అధికారులు, ఆయా జిల్లాలకు వచ్చిన సమయంలో ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూల పరిస్థితిలే ఉన్నాయని ప్రకటించారు. త్వరలోనే పనులను కూడా ప్రారంబిస్తామని పేర్కొన్నారు. కాని ఆచరణలో సాధ్యం మాత్రం కావడం లేదు. అలాగే కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా సంబంధిత స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే రెండు నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయినా కదలిక రావడం లేదు. విమానాశ్రయం కాకుండా ఏయిర్‌స్ట్రిఫ్‌ను అయినా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయినప్పటికీ అనుమతులు రావడంలో ఆలస్యమే జరుగుతోంది. కనీసం చిన్నస్థాయి విమానాశ్రయం ఏర్పాటుకు అయ్యే ఖర్చు వ్యయాన్ని అంచనా వేయాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంపై సందేహాలు వ్యక్తంమవుతున్నాయి.
కేంద్రంపైనే ఆశలన్నీ..
జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఏయిర్‌పోర్స్‌ లేదా ఎయిర్‌స్ర్టీప్‌కు ఏర్పాటు చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. అయినప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతుందనే దానిపై స్పష్టత నివ్వడం లేదు. మునుపెన్నడూలేని విధంగా జిల్లా పార్లమెంటు స్థానాన్ని కూడా బీజేపీ పార్టీ దక్కించుకుంది. ఇప్పుడైనా విమానాశ్రయ పనులను ప్రారంభిస్తే జిల్లాలో బీజేపీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరోసారి పార్లమెంటు స్థానం గెలుపు అవకాశాలు కూడా మెరుగుపడుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన వారే ఎంపీగా గెలవడంతో జిల్లాలో దీర్ఘాకాలిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జిల్లావాసులు భావించారు. మూడేళ్లు గడుస్తున్నా.. సీసీఐ, విమానాశ్రయాల ఏర్పాటుపై స్పందనే కరువుతోంది. కేవలం ఎన్నికల సమయంలోనే పోటాపోటీగా హామీలు ఇవ్వడం, ఆ తరువాత అంతా మరచిపోవడం నేతలకు అలవాటుగా మారింది. ఇప్పిటికే ఎంపీ సోయం బాపురావు పలుమార్లు జిల్లా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించినా.. కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన  చేయకపోవడం చర్చనీయంశంగా మారింది. ఇప్పటికైన జిల్లా కేంద్రంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకదృష్టి సారిస్తేనే విమానాశ్రయ ఏర్పాటు కల సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది.

Read more