నియోజకవర్గ బీడు భూముల్లో నీరు పారిస్తా

ABN , First Publish Date - 2022-02-24T04:22:31+05:30 IST

బీడుభూముల్లో నీరు పారిస్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండ లంలోని కోయగూడ (జి) గ్రామంలో 12బోరు బావుల నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు.

నియోజకవర్గ బీడు భూముల్లో నీరు పారిస్తా
బోరు బావుల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కౌటాల, ఫిబ్రవరి 23: బీడుభూముల్లో నీరు పారిస్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండ లంలోని కోయగూడ (జి) గ్రామంలో 12బోరు బావుల నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన గ్రామమైన కోయగూడలో టీఆర్‌ఎస్‌ పార్టీ, స్థానిక నాయకుల కృషితో 12బోరు బావులు నిర్మించనున్నట్లు పేర్కొ న్నారు. ఇప్పటికే 14బోరుబావులు ఉండగా విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు. గిరిజన కుటుంబాలను అన్ని రంగాల్లో ముందుంచాలని, వ్యవసాయ రంగాన్ని అభి వృద్ధి పర్చాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వెంటనే విద్యుత్‌ శాఖాధికారు లను పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. రైతులు డీడీలు కడతారని వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తే మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ విష యంలో అధికారులు అలసత్వం వహించకుండా రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఎంపీ పీలు విశ్వనాథ్‌, నానయ్య, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య, సర్పంచ్‌ సునంద, ఆర్‌ఎస్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more