‘ఉపాధిహామీ’లో అక్రమాలు

ABN , First Publish Date - 2022-12-06T22:01:51+05:30 IST

ఉపాధిహామీ పథకంలో అవినీతి అక్రమాలు బయటప డ్డాయి. మండల కేంద్రంలో మంగళవారం ప్రజావేదికలో సిబ్బందిపై వచ్చిన అవి నీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు.

‘ఉపాధిహామీ’లో అక్రమాలు

నెన్నెల, డిసెంబరు 6: ఉపాధిహామీ పథకంలో అవినీతి అక్రమాలు బయటప డ్డాయి. మండల కేంద్రంలో మంగళవారం ప్రజావేదికలో సిబ్బందిపై వచ్చిన అవి నీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. సంతృప్తికరమైన వివరణ ఇవ్వక పోవడం తో డీఆర్‌డీవో శేషాద్రి రూ.63 వేలు రికవరీ, రూ.36 వేలు జరిమానా విధించారు. మండలంలో రూ.12 కోట్లతో చేపట్టిన పనులపై పది రోజుల పాటు సామాజిక తనిఖీ నిర్వహించారు. పనులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎంపీపీ సంతో షం రమాప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ శ్యామలారాంచందర్‌, అదనపు డీఆర్‌డీవో దత్తా రావు, జిల్లా విజిలెన్స్‌ అధికారి సురేష్‌కుమార్‌, జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ అధికారి చంద్రశేఖర్‌, సోషల్‌ ఆడిట్‌ ఎస్‌టీఎమ్‌ నరేందర్‌, ఎస్‌ఆర్‌పీ జీవన్‌, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవోలు నరేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

గొళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఆర్‌డీవో శేషాద్రికి ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఇందూరి శశికళ వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-12-06T22:01:56+05:30 IST