ఘనంగా ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే
ABN , First Publish Date - 2022-10-12T03:27:46+05:30 IST
పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో మం గళవారం డబ్ల్యూసీఓడీఎస్సీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ గర్ల్స్ చైల్డ్ డేను ఘనంగా నిర్వహించారు.

ఆసిఫాబాద్, అక్టోబరు 11: పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో మం గళవారం డబ్ల్యూసీఓడీఎస్సీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ గర్ల్స్ చైల్డ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సఖి కేంద్రం హెల్స్లైన్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ సౌజన్య, డీసీపీఓ మహేష్, డీడబ్ల్యూఓ సావిత్రి, ట్రైబర్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, సఖి సిబ్బంది మమత, రాణి, శ్రీనిధి, కార్తీక్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల, మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్నేషల్ గర్ల్స్ చైల్డ్ డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ లక్ష్యం కోసం క్రమశిక్షణతో చదవాలని సూచిం చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌బాబు, నరహరి, గాయత్రి కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.