పాఠశాలల అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-05T04:09:27+05:30 IST

తాండూర్‌ ఎంపీపీ ఎస్‌ ఉర్దూ మీడియం, గోపాల్‌నగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ సంతోష్‌ను ఆదేశించారు.

పాఠశాలల అభివృద్ధి పనుల పరిశీలన
పనులను పరిశీలిస్తున్న డీఈవో

తాండూర్‌, అక్టోబరు 4: తాండూర్‌ ఎంపీపీ ఎస్‌ ఉర్దూ మీడియం, గోపాల్‌నగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు.  పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ సంతోష్‌ను ఆదేశించారు. గోపాల్‌నగర్‌ పాఠశాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేయడంపై కాం ట్రాక్టర్‌ నారాయణను అభినం దించారు. తాండూర్‌, బెల్లంపల్లి మండలాల విద్యాధికారులు వాసాల ప్రభాకర్‌, మహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు సతీష్‌కుమార్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు ఉన్నారు. 

భీమిని: భీమిని మండలంలోని చెన్నాపూర్‌, మామిడిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను సోమవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాధికారి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. 

కన్నెపల్లి: మెట్‌పల్లి పంచాయతీలోని మన్నెగూడెం, చింతపుడిలోని పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను మంగళవారం డీఈవో వెంకటేశ్వర్లు పరిశీలించారు.  పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, నాయకులు తిరుపతి, ఉపాధ్యాయులు ఉన్నారు.  

Read more