టీఆర్‌ఎస్‌ పాలనలో ఆదివాసీలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-06-07T06:44:21+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీలకు పూర్తిగా అన్యాయం చేస్తోందని, పేదలు బతకడానికి ప్రశ్నించే అవకాశం లేకుండా పాలన కొనసాగిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సోమవా రం జిల్లాకేంద్రంలోని జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడకు

టీఆర్‌ఎస్‌ పాలనలో ఆదివాసీలకు అన్యాయం
జైలులోని ఆదివాసీలను పరామర్శించి వస్తున్న ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ నాయకులు

ఆదివాసీ మహిళా రైతులను జైలులో పెట్టడం దారుణం : ములుగు ఎమ్మెల్యే సీతక్క 

జిల్లా జైలును సందర్శించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 6: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీలకు పూర్తిగా అన్యాయం చేస్తోందని, పేదలు బతకడానికి ప్రశ్నించే అవకాశం లేకుండా పాలన కొనసాగిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సోమవా రం జిల్లాకేంద్రంలోని జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడకు చెందిన ఆదివాసీ మహిళా రైతులను ఆమె కలిశారు. అ టవీ అధికారులు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు తరలించారని బాధితులు ఎమ్మెల్యేతో విన్నవించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2002 నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. అటవీ అధికారులు మహిళలని చూడకుండా బూతులు తిడుతూ కాళ్లతో తన్నడం అమానుషమన్నారు. దండేపల్లి రేంజ్‌ అధికారి అత్యుత్సాహంతో ప్రవర్తించారని, ఆయనను సస్పెండ్‌ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జైలులో ఉన్న 12మంది మహిళలకు బెయిల్‌ రాకుండా మరో కేసును కూడా వేశారని తెలిపారు. ఆమెతో పాటు ఏఐసీసీ ప్రణాళికల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, జడ్పీటీసీలు గోక గణేష్‌రెడ్డి, చారులత రాథోడ్‌, తదితరులున్నారు.

ఏజెన్సీ ప్రజల డిమాండ్‌ న్యాయమైనది

ఉట్నూర్‌: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజల డిమాండ్లు న్యాయమైనవని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు ఏజెన్సీ ఎస్సీలు నిర్వహించిన ధర్నాకు సంఘీభావం తెలపడంతో, నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడారు. ఆమె వెంట వెడ్మ బొజ్జు, అశోక్‌, చంద్రయ్య, దూట రాజేశ్వర్‌, నందం లాజర్‌, రాజమణి, తదితరులు ఉన్నారు.

Read more