మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-10-12T05:24:29+05:30 IST

మౌలిక సదుపాయాలు కల్పించాలి

మౌలిక సదుపాయాలు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగదు : ఎంపీ సోయం బాపురావు 

దిశ కమిటీ సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం

ఆదిలాబాద్‌ టౌన్‌, అక్టోబరు 11: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పార్లమెంట్‌ పరిధి లో గ్రామీణ ప్రాంతాలకు రవాణా, విద్యుత్‌ వంటి మౌళిక సదుపాయాల కల్పన కు కృషి చేయాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్యం, మున్సిపాలిటి, పౌర సరఫరాలు, స్ర్తీ శిశు సంక్షేమం, విద్యుత్‌, ఉపాధి హామీ, పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, జాతీ య రహదారి, టెలికాం, నీటిపారుదల శాఖ ద్వారా జిల్లాలో చేపడుతున్న కార్యక్ర మాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధుల మంజూరుకు ఆయా మంత్రిత్వ శాఖలను కలువడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతు సంక్షేమం కోసం నిధులు కేటాయించడం జరుగుతుందని ఆయా నిధులు పంటల సాగుకు వినియో గించుకోవాలని తెలిపారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు రవాణా, విద్యుత్‌, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు జిల్లాలోని ఆదివాసీ గ్రామాలలో మహిళలు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారి తమ విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా వారు తమ పరిధిలో సక్రమంగా విధులు నిర్వహించాలని, లేనిపక్షంలో సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. కలె క్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద 233 పాఠశాలలను మొదటి దశలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజాప్రతినిధులను ప్రతీ కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరారు. రక్త హీనతతో బాధపడుతున్న వారికి వైద్య శఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టి కాహారం అందిస్తామని, సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిలో వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామని అందరి సహాకారంతో వైద్యుల కొరత లేకుండా చూస్తా మన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టులు అధికారి వరుణ్‌రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, డీఆర్డీవో కిషన్‌, వివిధ శాఖల అధికా రులు దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రిమ్స్‌లో వైద్యుల నియామకం చేపట్టాలి : పాయల

కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లతో జిల్లా కేంద్రంలో నిర్మించిన సూపర్‌ స్పెషా లిటి ఆసుపత్రి (రిమ్స్‌)ని రాష్ట్ర మంత్రి ప్రారంభించినప్పటికీ.. అందులో వైద్యుల కొరత వేధిస్తోందని, వెంటనే వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకో వాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. దిశ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రావాల్సిన పసల్‌ బీమా, పంట నష్ట పరిహారం డబ్బులు వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరారు. 

Updated Date - 2022-10-12T05:24:29+05:30 IST