చెన్నూరుకు వంద పడకల ఆసుపత్రి మంజూరు

ABN , First Publish Date - 2022-10-12T04:11:43+05:30 IST

చెన్నూరు పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చెన్నూరులో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌కు, వైద్య విధాన పరిషత్‌కు లేఖ సమర్పించారు.

చెన్నూరుకు వంద పడకల ఆసుపత్రి మంజూరు
బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

చెన్నూరు, అక్టోబరు 11 : చెన్నూరు పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చెన్నూరులో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌కు, వైద్య విధాన పరిషత్‌కు లేఖ సమర్పించారు. పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం చెన్నూరు ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. రూ. 7 కోట్లతో  ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నారు. వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ కావ డంతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి భవన నిర్మాణానికి రూ.10.45 కోట్లు సంవత్సర వ్యయానికి రూ.21.70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొం ది. టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 

 

Updated Date - 2022-10-12T04:11:43+05:30 IST