షార్ట్‌ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

ABN , First Publish Date - 2022-09-17T06:28:47+05:30 IST

మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా గ్రామపంచాయతీ పరిధిలోని కల్మెట్‌తండాలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తి నష్టం జరిగింది.

షార్ట్‌ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

పాలకవీడు, సెప్టెంబరు 16: మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా గ్రామపంచాయతీ పరిధిలోని కల్మెట్‌తండాలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య బుల్లెమ్మ ఇంటిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి    రూ.47వేలు,  టీవీ, ఫ్రిజ్‌, కూలర్‌, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. మొత్తం రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందదని బెల్లెమ్మ తెలిపారు. పేద కుటుంబానికి చెందిన బుల్లెమ్మను ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. 


Read more