‘ఆసరా’పై ఆశలు

ABN , First Publish Date - 2022-08-10T06:08:22+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో ఆస రా ఫించన్లపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్ల వయస్సు పరిమితిని 65ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దానికనుగుణంగానే గతేడాది అక్టోబర్‌లో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

‘ఆసరా’పై ఆశలు
పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు (ఫైల్‌)

జిల్లాలో ఈనెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరు

మొత్తం 16వేల మందికి లబ్ధి

3 సంవత్సరాల తర్వాత పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో లబ్ధిదారుల హర్షం

జిల్లావ్యాప్తంగా 63వేల 444 మందికి వివిధ రకాల పింఛన్లు

ఆదిలాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో ఆస రా ఫించన్లపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్ల వయస్సు పరిమితిని 65ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దానికనుగుణంగానే గతేడాది అక్టోబర్‌లో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో సుమా రు 16వేల మంది అర్హులైన లబ్దిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్ప టికే జిల్లావ్యాప్తంగా 63వేల 444 పింఛన్లను ప్రభుత్వం అందిస్తోం ది. కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తే ఆసరా పింఛన్ల సంఖ్య మరింత పెరగనుంది. అ లాగే వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ పింఛన్ల దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా కొత్త ఆసరా పింఛన్ల మంజూరును నిలిపి వేయడంతో లబ్దిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిదులు గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రధానంగా ఆసరా పింఛన్లపై ప్రజలు నిలదీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అర్హులైన వారికి వెంటనే ఆసరా పింఛన్లను మంజూరు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.ముఖ్యంగా కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన వితంతు మహిళలకు ఆసరా పింఛన్లను అందించక పోవడంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అ యినా ఇన్నాళ్లు ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూనే కాలం గడుపుతూ వచ్చింది. తాజాగా స్వయాన ము ఖ్యమంత్రి కేసీఆరే పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లను అందిస్తామని ప్రకటించడంతో అన్నివర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

డయాలసిస్‌ రోగులకు ఆసరా

ఇప్పటికే ప్రభుత్వం వృద్ధాప్య, వి తంతువు, వికలాంగ, గీత కార్మికు లు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, బోదకాలు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లను అందిస్తోంది. కొత్తగా డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లను అందిస్తామని ము ఖ్యమంత్రి ప్రకటించడంతో ఆనందం వ్యక్తమవుతోంది. వీరందరికీ రూ.2016 చొప్పున నెలనెలా ఆసరా పింఛన్‌ అందనుంది. జిల్లాలో 300మందికి పైగానే డయాలసిస్‌ రోగులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 57ఏళ్లు పూర్తయిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 16 వేలకుపైగా దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. జిల్లావ్యాప్తంగా 63వేల 444మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్త దరఖాస్తుదారులకు పింఛన్‌ మంజూరు చేస్తే పింఛన్ల సంఖ్య మరింత పెరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారుగా 20వేల వరకు కొత్త పింఛన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం అందించనున్న పింఛన్‌తో నెలనెలా మందులు, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతాయని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందని అధికారిక ఆదేశాలు

పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా.. డీఆర్డీఏ అధికారులకు మాత్రం అధికారిక ఆదేశా లు అందలేదు. కేవలం మౌఖిక ఆదేశాలే అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 57ఏళ్లు నిండిన లబ్ధిదారులు గతంలోనే మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయిన లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో నే ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై ప్రకటన చేసినట్లు తెలుస్తుం ది. గత మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎందరో మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన వితంతువులకు  కూడా ఇన్నాళ్లు కొత్త పింఛన్‌ను మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శ లు వచ్చాయి. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి కూడా ఎక్కువగా ఆసరా పింఛన్‌ దరఖాస్తులే వచ్చాయి. కానీ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కార్యాలయాల చుట్టూ తిరిగినా.. ప్రభుత్వం అనుమతించ పోవడంతో లబ్ధిదారులకు తీవ్ర నిరాశనే మిగిలింది.   ముఖ్యమంత్రి ప్రకటనతో ఆసరా పింఛన్లపై మళ్లీ చర్చ మొదలైంది. గ్రామల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలను దరఖాస్తుదారు లు సంప్రదిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీల్లోనూ కౌన్సిలర్లకు దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. మొత్తానికి ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే కొత్త పింఛన్‌లను మంజూరు చేయిస్తామని ప్రజాప్రతినిధులు హామీలిస్తున్నారు.

ఇప్పటికే దరఖాస్తుదారుల వివరాలను పంపించాం

: కిషన్‌, డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌

జిల్లాలో 57ఏళ్లు నిండిన దరఖాస్తుదారుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వాని కి పంపించడం జరిగింది. సుమారుగా 16 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఉంది. మళ్లీ అవకాశం కల్పిస్తే దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరు పై ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అధికారిక ఆదేశాలు అందలేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తేనే కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటాం. అయినా.. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నాం. కొత్తగా డయాలసిస్‌ వారికి ఆసరా పింఛన్‌ అందిస్తామని ప్రకటన చేయడంపై పూర్తిస్థాయి విధి, విధానాలు అందాల్సి ఉంది.

Read more