ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2022-12-13T22:15:36+05:30 IST
అంటువ్యాధులపై ప్రజలకు అవగా హన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీహెచ్‌సీ, ఆశాలకు, ఆరోగ్య కార్య కర్తలకు అంటువ్యాధులపై శిక్షణ నిర్వహించారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 13: అంటువ్యాధులపై ప్రజలకు అవగా హన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీహెచ్‌సీ, ఆశాలకు, ఆరోగ్య కార్య కర్తలకు అంటువ్యాధులపై శిక్షణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య భధ్రతకు నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాల న్నారు. వ్యాధుల నియంత్రణపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాల న్నారు. ప్రోగాం అధికారులు నీరజ, ఫయాజ్‌ఖాన్ ప్రశాంతి, డెమో బుక్కా వెంకటేశ్వర్లు, రత్నమాల, దీపిక తదితరులు పాల్గొన్నారు.
Read more