హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-18T04:35:40+05:30 IST

స్వతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ

- రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడి 

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  17 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా  ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ  నెల  21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అధికారులు పూర్తి చే యాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీఆర్‌డీవో శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Read more