ఘనంగా గాంధీ జయంతి

ABN , First Publish Date - 2022-10-03T04:55:32+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో, గాంధీచౌక్‌లో, జిల్లా జైలులో అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఘనంగా గాంధీ జయంతి
కలెక్టరేట్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 2: దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో, గాంధీచౌక్‌లో, జిల్లా జైలులో అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా జైలులో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వైశ్యఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులుశ్రీనివాస్‌, బాలేష్‌ పాల్గొన్నారు.

Read more