గ్రంథాలయ సర్వ సభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-09-28T03:50:28+05:30 IST

సంచాకులు, పౌర గ్రంథాలయ శాఖ ఉత్తర్వుల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ యాదవ్‌రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.

గ్రంథాలయ సర్వ సభ్య సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ యాదవ్‌రావు

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 27: సంచాకులు, పౌర గ్రంథాలయ శాఖ ఉత్తర్వుల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ యాదవ్‌రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 2022-23 సంవత్సరానికి ఆమోదం పొందిన పద్దులకు బడ్జెట్‌ ఖర్చు చేయడానికి ఆమోదం కోసం ఆన్‌ డిమాండ్‌ బుక్స్‌ కొనుగోలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ చార్జీల బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ యాదవ్‌రావు మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అన్ని శాఖ గ్రంథాలయాల్లో గల 021-21, 2021-22 సంవత్సరానికి సంబంధించిన పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు, స్ర్కాప్‌ విక్రయానికి ఆమోదం తెలిపారని వివరించారు. కార్యక్రమంలో డీఈవో  అశోక్‌, ఏసీజీఈ ఉదయ్‌బాబు, డీపీవో ప్రశాంత్‌, కార్యదర్శి మునశ్వ ర్‌రావు, వెంకటరమణ, సదానందం, మజీద్‌ సలీం, రామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more