వ్యవసాయశాఖలో గ్రేడింగ్‌

ABN , First Publish Date - 2022-04-10T06:56:31+05:30 IST

ప్రభుత్వశాఖల పనితీరును మెరుగుపర్చేందుకే కాకుండా ప్రస్తుతం ఆ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల లక్ష్యసాధన, ఉద్యోగుల క్రియాశీలతలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు చేపట్టింది.

వ్యవసాయశాఖలో గ్రేడింగ్‌
పంటసాగుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

పనితీరు పర్యవేక్షణ కోసం పకడ్భందీ వ్యూహం 

తనిఖీలు పరిగణలోకి తీసుకొని ప్రశంసలు 

ప్రతి వారానికోసారి జిల్లా యూనిట్‌గా ర్యాంకులు 

జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు 

నిర్మల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వశాఖల పనితీరును మెరుగుపర్చేందుకే కాకుండా ప్రస్తుతం ఆ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల లక్ష్యసాధన, ఉద్యోగుల క్రియాశీలతలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొ ట్టమొదట వ్యవసాయశాఖ ప్రణాళిక బద్దంగా ర్యాకింగ్‌ పేరిట తనశాఖ పనితీరును మెరుగు పర్చుకునేందుకు రంగంలోకి దిగింది. దీనికి అను గుణంగా జిల్లాల వారీగా గ్రేడింగ్‌లను ఇస్తూ ఎప్పటికప్పుడు తమశాఖ అధికారులు, ఉద్యోగుల పనితీరును తెలుసుకుంటోంది. ప్రతీవారానికి ఒకసారి రాష్ట్రస్థాయిలో గ్రేడింగ్‌ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. రైతుబంధు, రైతుబీమా, పంటల నమోదు ప్రక్రియ, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాలతో పాటు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల దుకాణాల పర్యవేక్షణ వాటి స్టాక్‌ వివరాలు తెలుసుకునేందు కోసం ఈ ర్యాకింగ్‌లను ప్రాతిపాదికగా చేసుకుంటున్నారు. ఒకేసారి బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయశాఖ ఈ గ్రేడింగ్‌ విధానంను వినియోగించుకుంటోంది. ప్రతీవారానికి ఒకసారి గ్రేడింగ్‌ ఇస్తూ అన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేస్తోంది. వరుసగా గ్రేడింగ్‌లు తగ్గిపోయే జిల్లాలకు తాఖీదులు సైతం జారీ చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. జిల్లా ఈ సారి అన్ని ఫారామీటర్స్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇతర జిల్లాల కన్నా ముందు వరుసలో నిలిచింది. దీనికి అనుగుణంగా ర్యాకింగ్‌లో రెండోస్థానానికి గెలుచుకున్న జిల్లా ఇక ముందు మొదటిస్థానంలో కొనసాగేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు పకడ్భందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తానికి జిల్లాల వారీగా గ్రేడింగ్‌ల విధానం వ్యవసాయశాఖలో అమలు చేస్తున్న కారణంగా ఇతరశాఖలు సైతం అప్రమత్తమవుతున్నాయి. 

సెకండ్‌ ర్యాంక్‌లో నిర్మల్‌ జిల్లా

కాగా వ్యవసాయశాఖ ద్వారా అమలవుతున్న అన్ని పథకాల పనితీరులో మెరుగైన ప్రతిభ కనబర్చిన జిల్లారాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించింది. పంటల నమోదులో 2.40 లక్షల ఎకరాలకు బుకింగ్‌ చేసిన కారణంగా జిల్లాకు 40 మార్కులకు గానూ 39.600 మార్కులు దక్కా యి. అలాగే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి పథకం అమలులో మొత్తం గరిష్టం 30 మార్కులకు 27.89 మార్కులను నిర్మల్‌ జిల్లా సాధించింది. అలాగే రైతుబీమాలో 392 మంది రైతులకు బీమా పథకాన్ని వర్తింపజేసి వారి కుటుంబాలకు 19.60 కోట్లను జిల్లా వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకా ణాల తనిఖీలు, పర్యవేక్షణ, పారదర్శకత అమలు విషయంలో 10 మార్కులకు గానూ 9.87 మార్కులు సాధించింది. ముఖ్యంగా ఈ దుకాణాల లైసెన్సు రెన్యూవల్‌లు, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ దుకాణాల ద్వారా ఎలాంటి తప్పులు జరగకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవడంతో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. 

అన్ని శాఖలు అప్రమత్తం

ఇదిలా ఉండగా వ్యవసాయశాఖలో అమలు చేస్తున్న గ్రేడింగ్‌ విధానం ఇక అన్నిశాఖల్లో అమలు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఆయా శాఖలు ఇప్పటి నుంచే అప్రమత్తమవుతూ తమ శాఖల పనితీరును మెరుగుపర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయాశాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆచరణలో ఫలితం సాధించాలన్న ద్యేయంతోనే ఈ ర్యాకింగ్‌ విఽధానం అమలవుతోంది. దీనికి అనుగుణంగానే సంబంధిత శాఖల అఽధికారులు అప్రమత్తమవుతున్నారు. 

పనితీరు మెరుగుదల కోసమే

రాష్ట్రప్రభుత్వం వ్యవసాయశాఖ పనితీరును మరింత మెరుగు పర్చేందుకే కాకుండా సంబంధిత అధికారులను ఎప్ప టికప్పుడు అప్రమత్తం చేసేందుకు ర్యాకింగ్‌ విఽధానం చేపట్టింది. జిల్లాకు ఈ సారి రెండోర్యాంకు రావడం తమ అఽధికారులందరికీ గర్వకారణం. మొదటి నుంచి తమ శాఖ అఽధికారులు అంతా సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఈ సమిష్టి కృషి కారణంగానే తమశాఖ ద్వారా అమలవుతున్న పథకాలన్నీ విజయవంతం అవుతున్నాయి. భవిష్యత్‌లో మొదటిర్యాంకు సాధించడమే తమ ముందున్న ధ్యేయం. 

Read more