ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T00:01:52+05:30 IST

జిల్లాలో రైతులు పండించిన శనగ పంటను అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ జనరల్‌ సెక్రెటరిరీ సామ రూపేష్‌రెడ్డి కోరారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 : జిల్లాలో రైతులు పండించిన శనగ పంటను అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ జనరల్‌ సెక్రెటరిరీ సామ రూపేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలిసి వినతిప్రతం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన శనగ పంట 6 క్వింటాళ్ల 75 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడం సరికాదన్నారు. దిగుబడి ఎక్కువ వస్తున్న క్రమంలో ప్రభుత్వం 6 క్వింటాళ్ల 75 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా పంటను ప్రైవేట్‌ వ్యాపారస్తులకు అమ్ముకోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు పండించిన పూర్తిగా శనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్‌ ముందర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంజీవరెడ్డి, ఉప సర్పంచ్‌ అశోక్‌, మాజీ ఎంపీటీసీ భీమనవేణి వెంకట్‌, రమేష్‌రెడ్డి, విశ్వనాథ్‌, వినాయక్‌రెడ్డి, శశాంత్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-07T00:01:53+05:30 IST