విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-02T04:28:55+05:30 IST

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సోమ వారం చెన్నూరులో రూ.2.05 కోట్లతో నిర్మించిన కస్తూర్బా విద్యాలయం పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మెయిన్‌ రోడ్డు నుంచి పాఠశాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులను కేటాయిస్తామన్నారు. వెయ్యికి పైగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
కస్తూర్బా విద్యాలయం భవనాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

చెన్నూరు, ఆగస్టు 1: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సోమ వారం చెన్నూరులో రూ.2.05 కోట్లతో నిర్మించిన కస్తూర్బా విద్యాలయం పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మెయిన్‌ రోడ్డు నుంచి పాఠశాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులను కేటాయిస్తామన్నారు. వెయ్యికి పైగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థిపై యేటా రూ. 1.20 లక్షలను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థి నులకు బహుమతులు అందజేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు. 

కల్వర్టు నిర్మాణానికి శ్రీకారం 

మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరవాది నుంచి మంచి ర్యాలకు వెళ్లే రహదారి మధ్యలో రూ.35 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి చేసినట్లు ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ శ్రీకారం చుట్టారు. క్యాతన్‌పల్లిలోని నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ అమరవాది ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని,  ప్రజలు ఈ అవకాశాన్ని వినయోగించుకుంటారని తెలిపారు. 

రెండో విడత గొర్రెల పంపిణీకి కృషి చేస్తున్నందున జైపూర్‌ మండలంలోని 12 మంది సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సన్మానించారు. 

అన్ని వర్గాలకు ప్రభుత్వం అండ 

చెన్నూరురూరల్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉం టుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. నారాయణపూర్‌, నాగాపూర్‌, బీరెల్లి, వెంకంపేట గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి తీర ప్రాంతాల్లోని భూములు నీట మునిగాయని, రైతులను ఆదుకోవాలని  ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూరు, కోటపల్లి, జైపూర్‌ మం డలాల్లో త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ప్రారం భిస్తామన్నారు. దీంతో రెండు పంటలకు సరిపడ నీరు అందుబాటులో ఉంటుంద న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమని, చరిత్రలో నెంబర్‌వన్‌గా ప్రసిద్ధి చెందుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు భీమా పథకాన్ని త్వరలోనే కేటీఆర్‌ ప్రారంభిస్తారన్నారు. అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం దుగ్నేపల్లిలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఎంపీపీ మంత్రి బాపు, జెడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, ఆర్‌ఐ తిరుపతి, సర్పంచులు మంజుల, శారద, మానస, నాయకులు తిరుపతి, నర్సింహాచారి, సురేష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పాల్గొన్నారు.  

Read more