బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-11-19T00:29:47+05:30 IST

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యా లయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెడుతున్న బీజేపీ నాయకులు

నిర్మల్‌ టౌన్‌, నవంబరు 18 : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యా లయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్‌రెడ్డి, రాజులు మాట్లాడుతూ... ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపైన దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని, ఇది పిరికిపంద చర్య అని, లిక్కర్‌స్కామ్‌ నుంచి పక్కదోవ పట్టించడం కొరకు తెరాస ఆడుతున్న నాటకం అని, బీజేపీ నాయకుల జోలికి వస్తే చర్యకు ప్రతిచర్య ఉంటదని హెచ్చరించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెంబి జడ్పీటీసీ జానకిబాయి, జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ అలివేలు, కమల్‌నయన్‌, అసెంబ్లీ కన్వీనర్‌ ఎన్‌. మురళి, పట్టణ అధ్యక్షులు సాధం అరవింద్‌, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్‌, సీనియర్‌ నాయకులు, తదితరులు ఉన్నారు.

ఎంపీ అరవింద్‌ ఇంటిపై దాడి అమానుషం

నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడం అమానుషమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి రావుల రాంనాథ్‌ అన్నా రు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడటాన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీపై భౌతికదాడులకు దిగడం జరుగు తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరాశ నిస్పృహలకు లోనై స్వయంగా పోలీసులను వెంటపెట్టుకొని హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేయించడం జరిగిందన్నారు. దీనికి తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Updated Date - 2022-11-19T00:29:47+05:30 IST

Read more