తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-02-24T04:20:03+05:30 IST

ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతిచెందిన సంఘ టన బుధవారం దహె గాం మండలం హత్తి నిలో చోటు చేసుకుంది.

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
చెట్టు వద్ద పడి ఉన్న సాయిగౌడ్‌

దహెగాం, ఫిబ్రవరి 23: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతిచెందిన సంఘ టన బుధవారం దహె గాం మండలం హత్తి నిలో చోటు చేసుకుంది. తోటి గీతకార్మికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్తినికి చెందిన రంగుసాయిగౌడ్‌(25) రోజువారీగా బుధవారం ఉదయం6గంటలకు తాటి చెట్లు ఎక్కడానికి వెళ్లాడు. తాటిచెట్టు ఎక్కి కల్లుగీసే క్రమంలో ప్రమాదవ శాత్తు మోకుఊడిపోయి కిందపడి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ అతన్ని గమనించలేదు. ఉదయం 6 గంటలకు వెళ్లిన సాయిగౌడ్‌ 9గంటలు అయినా రాక పోవడంతో బంధువుల, తోటిగీత కార్మికులు వెళ్లి వెతకగా అప్పటికే చెట్టుపై నుంచిపడి మృతిచెంది ఉండడాన్ని గమనించి కుటుంబీ కులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబీకులు సంఘటన స్థలా నికి చేరుకుని రోధించారు. మృతుడి సోదరుడు నాగేష్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై ప్రకాష్‌ తెలిపారు.

Read more