వేర్వేరు ఘటనల్లో గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-06-12T04:29:53+05:30 IST

భద్రాచలంలో రెండు ఘటనల్లో రూ.15 లక్షల విలువైన గంజాయిని ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేయగా వారి నుంచి ఒక కారు, ద్విచక్రవాహనం, 101కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వేర్వేరు ఘటనల్లో గంజాయి పట్టివేత
సీజ్‌ చేసిన గంజాయితో పాటు నిందితులను చూపుతున్న ఎకై్ౖసజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

భద్రాచలం జూన్‌ 11: భద్రాచలంలో రెండు ఘటనల్లో రూ.15 లక్షల విలువైన గంజాయిని ఖమ్మం  ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేయగా వారి నుంచి ఒక కారు, ద్విచక్రవాహనం, 101కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి చెన్నైకి గంజాయి తరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ తిరుపతి, సీఐ సర్వేశ్‌ భద్రాచలంలో నిఘా పెట్టి కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. కార్‌కు ప్రెస్‌ స్టికర్‌ అంటించి, నాలుగు రాష్ర్టాల నెంబర్‌ ప్లేట్లు మారుస్తూ గంజాయి తరలిస్తున్న చెన్నైకి చెందిన రామస్వామి చిన్నదురైని అరెస్టు చేశారు. ఏపీలోని మోతుగూడెం నుంచి భద్రాచలం మీదుగా చెన్నైకి తరలిస్తున్న 90కేజీల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో బైక్‌పై రెండు సంచులలో తరలిస్తున్న 11కేజీల గంజాయిని పట్టుకు న్నారు. ఈ ఘటనలో ఖమ్మానికి చెందిన మట్టే మునీందర్‌, చింతల నిశాంత్‌లను అరెస్టు చేసినట్లు ఎకై్ౖసజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ తిరుపతి తెలిపారు.

Updated Date - 2022-06-12T04:29:53+05:30 IST