ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-04-11T04:23:44+05:30 IST

మండలంలోని అందవెల్లి గ్రామ సమీ పంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాలీఆటో బోల్తాపడింది. తాండూర్‌ మండలం రేచిని నుంచి కాగజ్‌నగర్‌కు వస్తున్న ఆటో అందవెల్లి మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడగా అందులో ప్రయాణికుస్తున్న ముగ్గు రితోపాటు డ్రైవర్‌ టేకం రాజన్నకు గాయాలయ్యాయి.

ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు
బోల్తా పడిన ఆటో

కాగజ్‌నగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10: మండలంలోని అందవెల్లి గ్రామ సమీ పంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాలీఆటో బోల్తాపడింది. తాండూర్‌ మండలం రేచిని నుంచి కాగజ్‌నగర్‌కు వస్తున్న ఆటో అందవెల్లి మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడగా అందులో ప్రయాణికుస్తున్న ముగ్గు రితోపాటు డ్రైవర్‌ టేకం రాజన్నకు గాయాలయ్యాయి. వీరు విద్యుత్‌ మర మ్మతు పనులు చేసేందుకు వెళ్తున్నక్రమంలో ఈ సంఘటన చోటు చేసు కుంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ఈసుగాం ఎస్సై హీరా మాన్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

Read more