రైతుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-11-24T22:28:28+05:30 IST

రైతుల సమస్యలు పరి ష్కరించాలని గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా నిర్వహిం చారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలి

చెన్నూరు, నవంబరు 24: రైతుల సమస్యలు పరి ష్కరించాలని గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా నిర్వహిం చారు. పార్టీ మండల అధ్యక్షుడు బాపగౌడ్‌, డీసీసీ సభ్యుడు ఖలీల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమ య్యారని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయక పోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహ త్యకు పాల్పడుతున్నారన్నారు. వర్షాలతో నష్టపో యిన పంటలకు పరిహారం ఇవ్వలేదన్నారు. ధరణి పోర్టల్‌ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యల ను పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో పంటలు మునిగి రైతులు నష్టపోతున్నారని, శాశ్వత పరి ష్కారం చూపాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. నాయకులు వెంకటి, చీర్ల సుధాకర్‌రెడ్డి, మంత్రి లక్ష్మణ్‌, కొల్లూరి లచ్చన్న, రాంగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

తాండూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రవీందర్‌, పోశం, షేక్‌ అహ్మద్‌, శ్రీను, యశోద పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:28:28+05:30 IST

Read more